బిగ్ బాస్ క్రేజీ  కాలేజ్ టాస్క్‌లో బెస్ట్ టీజర్‌, బెస్ట్ స్టూడెంట్‌ను ఏకాభిప్రాయంతో  బిగ్ బాస్ తెలియచేయమనగా.. స్టూడెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో బాబా భాస్కర్ ను బెస్ట్ టీచర్ ఎంపిక చేశారు. టీచర్స్ ముగ్గురూ వితికా, వరుణ్ బాబా భాస్కర్‌ను బెస్ట్ స్టూడెంట్‌గా మహేష్‌ని తెలిపారు.బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్‌లుగా ఎన్నికైన బాబా భాస్కర్, మహేష్‌ విట్టా ఇద్దర్నీ కెప్టెన్సీ పోటీదారులుగా తెలిపారు బిగ్ బాస్.

ఇక కెప్టెన్ పోరులో భాగంగా.. ‘ప్రచారమే ఆయుధం’ అనే ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ వివరాల్లోకి వెళ్తే పోటీదారులు ఇద్దరు ఇంటి సభ్యుల దగ్గరకు వెళ్లి తమని కెప్టెన్‌గా గెలిపించాలని బిగ్ బాస్ తెలిపారు. ఎవరి ప్రచారం నచ్చితే వాళ్ళని కెప్టెన్ గ అర్హులు అని తెలిపారు. ఈ టాస్క్ పోరు ప్రకారం మహేష్ విట్టా, బాబా భాస్కర్‌లు మిగిలిన ఇంటి సభ్యుల దగ్గరకు వెళ్లి తమని కెప్టెన్‌గా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

వీళ్ల ప్రచారం నచ్చతే తమ వద్ద ఉన్న దండను తీసి కంటెస్టెంట్స్ మెడలో వేయాల్సి ఉంటుంది.ఈ టాస్క్‌లో పునర్నవి, హిమజలు.. బాబా భాస్కర్ మెడలో దండ వేయగా.. మహేష్ విట్టా మెడలో వరుణ్ సందేశ్, హిమజ, శివజ్యోతి, రాహుల్, రవి, శ్రీముఖిలు దండలు వేశారు. ఎనిమిది మందిలో ఎక్కువ ఓట్లు మహేష్ విట్టాకే రావడంతో గురువు బాబా భాస్కర్‌పై విజయకేతనం ఎగురవేసి బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు శిష్యుడు మహేష్ విట్టా.

క్రేజీ టాస్క్‌లు.. షో మరింత ఆసక్తికరంబిగ్ బాస్ ఇస్తున్న క్రేజీ టాస్క్‌ లతో షో మరింత ఆసక్తికరంగా మారుతోంది. రోజు రోజుకూ సరికొత్తగా ట్రెండ్‌ని క్యాచ్ చేస్తూ టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇక వీటిపై కంటిస్టెంట్స్ చేస్తున్న పర్‌ఫార్‌మెన్స్ బుల్లితెర ఆడియన్స్‌కి వినోదాల విందు ఇస్తోంది. దీంతో ఈ మరింత ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: