నేడు అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి . ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారి కొడుకు, నటుడు అక్కినేని నాగార్జున తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు రెండు కళ్లలాంటివారని అందరు అంటుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నత స్థానాన్ని అందుకోవడంలో ఏఎన్నార్ కృషి ఎంతగానో ఉంది. అది నూటికి నూరు శాతం నిజమే. వారి కృషి వల్లే చిత్ర పరిశ్రమ ఈరోజు ఇంతటి స్థాయిలో ఉంది. నాగార్జునగారు ఈరోజు నాన్న పుట్టినరోజు. మమ్మల్ని మీ జీవితంలో భాగస్వామ్యులుగా చేసుకున్నందుకు థ్యాంక్యూ అని పేర్కొన్నారు. మిమ్మల్ని మిస్సవుతాం. ' మేము మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’ అని నాగ్ తెలిపారు.అక్కినేని కోడలు సమంత కూడా నాగేశ్వరరావుగారిని  గుర్తుచేసుకున్నారు. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌లో నాగేశ్వరరావుగారు  నటించిన సినిమల్లోని పాత్రలన్నీ కలిపిన ఫొటోలన్నీ కలిపి ఉన్నఒక  ఇమేజ్‌ను పెట్టుకున్నారు. ఏఎన్నార్ మనవడు, నటుడు సుశాంత్ కూడా తన తాతగారితో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ ట్విటర్‌లో పంచుకున్నారు.సుశాంత్ చిన్నతనంలో తన తాతగారితో కలిసి దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే తాతా.. నేను మీ జీవితంలో కొంతకాలమే భాగమై ఉన్నప్పటికీ కానీ నేను ఎంతోగానో గొప్పగా ఉంది అని తెలిపారు. మరింత కష్టపడేలా మీరు మాలో స్ఫూర్తి నింపారు అని తెలియచేసారు. మీరు మా హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు’ అని పేర్కొన్నారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని రామాపురంలో జన్మించారు నాగేశ్వరరావు. 1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు నాగేశ్వరరావు. ఆయన కెరీర్‌లో దాదాపు 244 సినిమాల్లో నటించారు.
ReplyReply AllForwardEdit as new


మరింత సమాచారం తెలుసుకోండి: