చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ‘సైరా’ మూవీ చిరంజీవి 13 సంవత్సరాల కల. వాస్తవానికి ఈ కథను పరుచూరి గోపాలకృష్ణ 15 సంవత్సరాల క్రితం చిరంజీవికి చెప్పినప్పుడు ఆ కథను మూవీగా తీయాలని అప్పట్లోనే పరుచూరి బ్రదర్స్ తో ఒక స్క్రిప్ట్ రాయించి చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పెట్టి రాజకీయాలలోకి రాకముందు తన ఆఖరి సినిమాగా చేయాలని కల కన్నాడని తెలుస్తోంది.

అయితే అప్పట్లోనే ఆ మూవీ బడ్జెట్ 80 కోట్లు దాటిపోవడంతో ఆ స్థాయిలో తెలుగు సినిమా మార్కెట్ లేకపోవడంతో చిరంజీవి తన ఆలోచనను వాయిదా వేసుకున్నాడు. ఆతరువాత రాజకీయాల నుండి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకుని తన మొదటి సినిమాగా ‘సైరా’ ను తీయాలని భావిస్తే అసలు 9సంవత్సరాల తరువాత జనం తనను ఆదరిస్తారో లేదో అన్న అనుమానంతో సేఫ్ ప్రాజెక్ట్ గా ‘ఖైదీ నెంబర్ 150’ తీసాడు అని అంటారు. 

అయితే ఆమూవీ రికార్డులు సృష్టించడంతో పాటు ‘బాహుబలి’ తెలుగు సినిమా మార్కెట్ ను విపరీతంగా పెంచడంతో చరణ్ ప్రోత్సాహంతో చిరంజీవి ‘సైరా’ కు సాహసించాడు. మొదట్లో ఈ మూవీని 150 కోట్ల బడ్జెట్ తో అనుకుంటే ఈ మూవీ పరిధి రోజురోజుకు పెరిగి పోవడంతో ఇప్పుడు ఈ మూవీ 300 కోట్ల బడ్జెట్ మూవీగా మారిపోయింది. 

కొద్ది రోజుల క్రితం ఇలాంటి భారీ బడ్జెట్ తో వచ్చిన ‘సాహో’ 450 కోట్లు వసూలు చేసినా బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. దీనితో ‘సైరా’ వల్ల నిజంగా బయ్యర్లు లాభ పడగలుగుతారా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలో సాధారణ ప్రేక్షకులకు నచ్చే సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ చాల తక్కువగా ఉంటాయని మొత్తం అంతా బ్రిటీష్ వారి పై పోరాటం అలనాటి జమిందారీ సంస్థానాల సరదాలతో ‘సైరా’ ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ధియేటర్లలోకి వెళ్ళగానే సాధారణ ప్రేక్షకులను అలనాటి స్వాతంత్రోద్యమ పరిస్థితుల్లోకి ‘సైరా’ తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే ఈమూవీ చిరంజీవి కలలు కంటున్న రికార్డులను క్రియేట్ చేయగలుగుతుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: