మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దలకొండ గణేష్) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ఫుల్ టాక్ ని సంపాదించడం జరిగింది. ఇప్పటివరకు పలురకాల క్లాస్ క్యారెక్టర్లలో నటించిన వరుణ్ తేజ్, ఈ సినిమాలో పూర్తిగా తన యాక్షన్ స్టైల్ ని మార్చి, గద్దలకొండ గణేష్ అనే మాంచి మాస్ పాత్రలో ఇరగ్గొటినట్లు ఎక్కువమంది ప్రేక్షకులు చెప్తున్న మాట. మాస్ సినిమాలను తనదైన కమర్షియల్ స్టైల్ లో అదిరిపోయేలా తెరకెక్కించే హరీష్ శంకర్, ఈ సినిమాతో మరొక్కసారి తన అద్భుతమైన డైరెక్షన్ టాలెంట్ ని ప్రదర్శించి ఆకట్టుకున్నారట.  

నిజానికి హరీష్ శంకర్ సినిమాలు ఫస్ట్ హాఫ్ ఎంతో బాగుంటాయి, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నిరాశపరుస్తాయి అనే వాదనకు ఈ గద్దలకొండ గణేష్ సినిమాతో ఫుల్ స్టాప్ పెట్టారట హరీష్ . ముఖ్యంగా ఎక్కువ శాతం, ప్రేక్షకులకు మంచి ఎంటెర్టైన్మెంట్ అందించే విధంగా స్క్రిప్ట్ ని తీర్చిదిద్ధిన ఆయన టాలెంట్ కు ఎంతైనా హ్యాట్సాఫ్ చెప్పాలని అంటున్నారు. ఇకపోతే వరుణ్ సరసన హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే కూడా ఇప్పటివరకు కెరీర్ పరంగా చేసిన అన్ని సినిమాల కంటే ఇందులో మరింతగా సహజమైన నటనను కనబరిచి ఆకట్టుకునేలా నటించిందట. 

మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్ లో ముఖ్యంగా జర్ర జర్ర అలానే వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్స్ థియేటర్లో అదిరిపోయాయట. ఇకపోతే బ్రహ్మాజీ మరియు సత్య కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన బలం అంటున్నారు. ఇక ఈ సినిమాకు మిక్కీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగుందని, దీనితో ఇకపై మిక్కీకి మంచి మాస్ సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశం వస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్, గత్తర లేపిండని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: