ఇటీవల వరుసగా కొంత క్లాస్ మరియు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో అదరగొట్టే మాస్ క్యారెక్టర్లో నటించి మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా మంచి కిక్ ఇచ్చాడు. ఇక ఆ క్యారెక్టర్ లో ఆయన పలికిన డైలాగ్స్, యాక్షన్ మరియు ఫైట్స్ కు థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నట్లు తెలుస్తోంది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మంచి హిట్ టాక్ ని కైవశం చేసుకోవడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

ముందుగా ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి హీరో వరుణ్ తో పాటు దర్శకుడు హరీష్ శంకర్ పాత్ర కూడా ఎక్కువ ఉందని అంటున్నారు ప్రేక్షకులు. నిజానికి జిగర్తాండ సినిమాను ఉన్నది ఉన్నట్లు దించి ఉంటె, మన వాళ్లకు అంతగా నచ్చి ఉండేది కాదని, కాబట్టి ఫస్ట్ హాఫ్ లో మార్పులు చేయకుండా, సినిమాకు ప్రాణమైన సెకండ్ హాఫ్ పై దర్శకుడు మరింతగా దృష్టి పెట్టి మంచి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారని ప్రశంశలు కురిపిస్తున్నారు. అక్కడక్కడా సినిమాలో కొన్ని ల్యాగ్స్ ఉన్నప్పటికీ అవి పెద్దగా లెక్కలోకి రావని కూడా చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే, వరుణ్ ప్రక్కన సరిగ్గా సరిపోయిందని,  వారిద్దరి జోడి తెరపై ఎంతో అదిరిందని అంటున్నారు. 

మరొక జంటైన అధర్వ మురళి మరియు మృణాళిని రవి కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారని, అలానే విజువల్స్ పరంగా సినిమాకు కెమెరామ్యాన్ గా పనిచేసిన ఆయనంక బోస్ గారు ఇరగతీశారని చెప్తున్నారు. ఇకపోతే ఎక్కువగా మాస్ కమర్షియల్ అంశాలతో సినిమాలు తీసే దర్శకుడు హరీష్, ఈ సినిమాలో హీరో వరుణ్ ని గద్దలకొండ గణేష్ అనే మాస్ పాత్రలో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని, అలానే సినిమాని తన భుజస్కందాలపై వేసుకుని వన్ మ్యాన్ షోగా నడిపించిన వరుణ్ తేజ్ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడవచ్చని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: