వాల్మీకి .. రామాయణం రాసిన రచయత పేరు అయినా ఆ పేరుపై ఇప్పుడు వచ్చిన చిత్రం మాత్రం చాలా వైలెంట్ గా ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుండి పేరు మార్చాలి పేరు మార్చాలి అంటూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఏ మాత్రం పట్టు వదలకుండా చివరి వరుకు పేరు మార్చలేదు. కానీ సరిగ్గా సినిమా విడుదల చేసే సమయానికి పేరు మార్చేశాడు దర్శకుడు.                     


అయితే ఇప్పుడు పేరు మార్చడం పక్కన పెడితే సినిమా సూపర్ అంటూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి కథానాయకుగా నటించిన మెగా ఫ్యామిలి వారసుడు వరుణ్ తేజ్ స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయేలా నటనతో ఈ సినిమాలో చేలా రేగాడు. పెద్దనాన్న చిరంజీవి నటనని, చిన్ననా పవన్ కళ్యాణ్ నటనని మిక్సీలోకి వేసి తిస్తె వరుణ్ తేజ్ నటన వస్తుంది అని అంటున్నారు మరికొందరు ప్రేక్షకులు.                                                  

            

అయితే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బ్రహ్మాజీ కామెడీ. సినిమాలో చివరి వరుకు రాణి బ్రహ్మాజీ చివరిలో వచ్చి అందరి ముఖాల్లో నవ్వులు పువ్వులుగా పూయించాడు బ్రహ్మాజీ. విచిత్రమైన కామెడీ గురువుగా ఈ సినిమాలో కనిపించడు బ్రహ్మాజీ. ఏది ఏమైనా దర్శకుడు హరీష్ శంకర్ కొత్తగా ట్రై చేసి మాస్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చేసుకున్నాడు. క్రిటిక్స్ రైటర్స్ సైతం సినిమా అద్భుతం అని కామెంట్లు పెడుతున్నారు.                                      


మరింత సమాచారం తెలుసుకోండి: