'వాల్మీకి'' సినిమా దర్శకుడు హరీష్ శంకర్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.వరుణ్ తేజ్,పూజా హెగ్డే జంటగా నటించిన వాల్మీకి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది.ఈ సినిమాకు పేరు కూడా మారిపోయి,వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్‌గా మారిపోయిన.ప్రేక్షకుల్లో జోష్ మాత్రం తగ్గలేదు.ఈ వివాదం సంగతి పక్కనపెట్టి అసలు ఈ సినిమాకి వాల్మీకి టైటిల్ ఎందుకు సరైనదని భావించారు అని మీడియా ప్రశ్నించగా హరీష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.ఒక మనిషికి సంబంధించి అత్యున్నత మార్పుకు ఉదాహరణగా వాల్మీకి గురించి చెప్పుకోవచ్చు.మా చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర కూడా గొప్పగా ట్రాన్స్ఫర్మేషన్ చెందుతుంది.అందుకే వాల్మీకి మించి బెస్ట్ టైటిల్ ఈ సినిమాకి లేదని భావిస్తున్నాం అన్నాడు.



ఇక వాల్మీకి గురించి వ‌రుణ్ తేజ్ ఏం చెప్పారంటే,సాధార‌ణంగా డైరెక్ట‌ర్స్ నా ద‌గ్గ‌రికీ ల‌వ్ స్టోరీనే చెప్పాల‌ని వ‌స్తారు.అయితే అప్ప‌టికే ఫిదా,ఎఫ్ 2 సినిమాల్లో ల‌వ‌ర్‌బోయ్‌గా క‌న‌ప‌డ‌టంతో ల‌వ్ సినిమాల‌కు గ్యాప్ ఇద్దామ‌ని అనుకున్న సమయంలో హ‌రీష్ గారు దాగుడుమూత‌లు క‌థ‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు.ఆ క‌థ న‌చ్చింది.అయితే ఆయ‌న స్టైల్లో ఓ సినిమా చేయాల‌నుంద‌ని ఆయ‌న‌కు చెప్పాను.అప్పుడాయ‌న త‌మిళ చిత్రం  జిగర్తాండ గురించి చెప్పారు. ఆ సినిమా చూడు త‌ర్వాత మాట్లాడుదాం అన్నారు.నేను సినిమా చూశాను.సినిమా బాగా న‌చ్చింది.త‌ర్వాత ఇద్ద‌రం కూర్చుని మాట్లాడుకుని మార్పులు చేర్పులు చేసుకున్నాక దీన్ని తెరకెక్కించారు హరీష్ శంకర్.



ఇక లుక్ విష‌యానికి వ‌స్తే నేను చిరంజీవి గారి లుక్‌ను కాపీ కొట్టాను.పునాదిరాళ్ళు స‌మయంలో డాడీ అలాగే ఉండేవారు.అదే హెయిర్ స్టైల్‌ను ఇందులో నేను ట్రై చేశాను.అలాగే సినిమా క‌థ‌ను కూడా ముందు చిరంజీవి గారికే వినిపించాం.ఆయ‌నకు ఈ పాత్ర బాగా న‌చ్చింది.అంటూ వ‌రుణ్ తేజ్ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు.ఇక ఈ రోజు రిలీజైన ఈ సినిమా ప్రతి సెంటర్‌లో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శింపబడుతున్న సందర్భంలో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఇక ఈ మూవీ టైటిల్ ను మార్చవలసిన పరిస్థితులు ఏర్పడినా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ మూవీని ప్రమోట్ చేస్తూ హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.మొత్తానికి ఇదో పక్కా మాస్ హిట్ అని చెప్పవచ్చూ..


మరింత సమాచారం తెలుసుకోండి: