ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్దె.. హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. డిజే తర్వాత పూజా క్రేజ్ బాగా పెరిగింది. వరుసగా స్టార్ అవకాశాలను అందుకుంటున్న పూజా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది.


ఇక ఈరోజు రిలీజైన వాల్మీకి (గద్దలకొండ గణేష్) సినిమాలో కూడా శ్రీదేవిగా అదరగొట్టేసింది పూజా హెగ్దె. కొంతమంది స్క్రీన్ ప్రెజెన్స్ వెండితెరకు ఓ కలరింగ్ తెస్తుందని అంటారు కదా.. అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే పూజా హెగ్దె ఎపిసోడ్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. గద్దలకొండ గణేష్ హీరోయిన్ శ్రీదేవి వీరాభిమాని.. అయితే ఈ శ్రీదేవి అదేనండి పూజా హెగ్దెని చూశాక ఆమెను మర్చిపోయి ఈయన వెంటపడతాడు గణేష్.    


ఇక సినిమాలో శ్రీదేవి అని పాత్ర పేరు పెట్టడమే కాకుండా శోభన్ బాబు, శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ రీమిక్స్ చేశారు. ఆ సాంగ్ అలా మొదలవడమే థియేటర్ మొత్తం అరుపులు కేకలే.. శోభన్ బాబుగా వరుణ్ తేజ్.. శ్రీదేవిగా పూజా హెగ్దె సెట్ అయ్యారు.   


ముఖ్యంగా జూనియర్ శ్రీదేవిగా పూజా హెగ్దె ఆ పాటలో ముద్దొచ్చేలా ఉందని చెప్పొచ్చు. పూజా హెగ్దెని ఇష్టపడే వారు సినిమాలో ఈ పాట కోసం మరో రెండు సార్లు సినిమా చూసేయొచ్చు. అయితే పూజా హెగ్దెని అనుకున్న తర్వాత శ్రీదేవి పాట అనుకున్నారో ఏమో కాని ఆ పాటలో పూజా హెగ్దె సేమ్ శ్రీదేవిని దించేసిందని అంటున్నారు. గద్దలకొండ గణేష్ లో పూజా చేసింది చిన్న పాత్రే అయినా ఆమె కెరియర్ కు ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.    



మరింత సమాచారం తెలుసుకోండి: