నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. యావరేజ్ టాక్ వచ్చినా మొదటి మూడు రోజులు ఈ సినిమాకు కలెక్షన్లు బాగా వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గ్యాంగ్ లీడర్ మొదటి మూడు రోజుల్లోనే 50 శాతం రికవరీ చేసింది. 
 
కానీ అనూహ్యంగా సోమవారం నుండి గ్యాంగ్ లీడర్ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఆ తరువాత రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతున్నాయే తప్ప పెరగటం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు 14.50 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఆరో రోజు గ్యాంగ్ లీడర్ సినిమాకు కేవలం 36 లక్షల రూపాయలు కలెక్షన్లు రాగా 7వ రోజు కేవలం 20 లక్షల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఈరోజు వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) , సూర్య నటించిన బందోబస్త్ సినిమాలు విడుదల కావటంతో గ్యాంగ్ లీడర్ సినిమాకు థియేటర్లు తగ్గాయి. వరుణ్ గద్దలకొండ గణేష్ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటిక్ టాక్ వినిపిస్తోంది. బందోబస్త్ సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ రెండు సినిమాల పోటీని తట్టుకుని గ్యాంగ్ లీడర్ ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. 
 
మైత్రీ మూవీ మేకర్స్ కు ఈ సినిమాతో కూడా నష్టాలు తప్పటం లేదు. జులై నెలలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా నిర్మాతలకు భారీగానే నష్టాలను మిగిల్చింది. డియర్ కామ్రేడ్ రేంజులో కాకపోయినా గ్యాంగ్ లీడర్ సినిమాకు కూడా నష్టాలు మాత్రం తప్పటం లేదు. స్టార్ హీరోలతో హిట్లు కొడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ కు మిడిల్ రేంజ్ హీరోలు కలిసిరావటం లేదని మరోసారి గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రూవ్ అయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: