ఆ వాల్మీకి మంచివాడుగా మారడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు కాని.ఈ వాల్మీకి గద్దలకొండ గణేష్ గా మారడానికి మాత్రం చాల శ్రమ కోర్చాడు.ఒక రకంగా ఆ సమయంలో అది రీలీజ్ ఫిక్సైయ్యాక అంటే అటు ప్రొడ్యూసర్,ఇటు డైరెక్టర్ పడే బాధ వర్ణానితం.అసలు వాళ్లిద్దరు సరిగ్గా నిద్దురకూడా పోయారోలేదో తెలియదు.వాస్తవానికి బోయ కులస్తులు టైటిల్ మార్చాలంటూ ముందు నుండి చెబుతూనే వున్నారు.అప్పుడే ఒక మెట్టు దిగి వచ్చి టైటిల్ ని మార్చే ప్రయత్నం చేసి ఉంటే చివరి నిమిషంలో హైరానా పడాల్సిన అవసరం ఉండేది కాదని కొందరు భావిస్తున్నారు.అప్పటికప్పుడు కలెక్టర్ల ఆదేశంతో రెండు జిల్లాల్లో ప్రదర్శన నిలిపేయడంతో డిస్ట్రిబ్యూటర్లు ఖంగు తినాల్సి వచ్చింది. షూటింగ్ దశలోనే హీరో క్యారెక్టరైజేషన్ నెగెటివ్ గా ఉందని తెలిసిన బోయ కార్మికులు వివాదానికి తెర తీశారు.



వాల్మీకి టైటిల్ ని మార్చాల్సిందిగా కోరారు.కానీ పట్టించుకోకపోవడంతో రిలీజ్ ముంగిట చివరి క్షణంలో ఇన్ని పాట్లు పడాల్సి వచ్చింది.కనీసం మైత్రి వాళ్లు ఇంతకుముందు గ్యాంగ్ లీడర్ని కాస్తా,నానీస్ గ్యాంగ్ లీడర్గా మార్చారు.కాని డైరెక్టర్ హరీష్‌శంకర్ కనీసం అలాంటి ప్రయత్నం అయినా చేయలేదు.చివరకు  లాస్ట్ మినిట్లో టైటిల్ మార్పుకు అంగీకరిస్తూ కోర్టుకు వివరణ ఇవ్వవలసి వచ్చింది.అటుపై పరుగు పరుగున కొత్త టైటిల్ కార్డ్ ని రెడీ చేయించడమంటే మాటలు కాదు,క్యూబ్ లో టైటిల్ మార్పు అంటే నిమిషాలపై అయ్యేది కాదు.పైగా ఖర్చుతో కూడుకున్నది.అయినా తప్పలేదు.ఎట్టకేలకు వాల్మీకి టైటిల్ మార్చుకుని గద్దలకొండ గణేష్ పేరుతో రిలీజ్ చేశారు.ఇన్ని వివాదాల నడమ విడుదలైన ఈ సినిమా వీళ్లిద్దరికి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.



వరుణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో నటించాడనేకంటే జీవించాడనే చెప్పాలి.కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ ..కెరీర్ మొదట్లోనే‘కంచె’సినిమాలో సైనికుడి పాత్రలో మెప్పించాడు.ఆ తర్వాత‘లోఫర్’ సినిమాలో మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు.అలాగే ‘ఫిదా’,‘తొలిప్రేమ’సినిమాల్లో లవర్ బాయ్‌గా మెప్పించిన వరుణ్ తేజ్..ఈ యేడాది సంక్రాంతికి రిలీజైన‘ఎఫ్ 2’లో తనదైన కామెడీ పండించాడు.ఇపుడు గద్దలకొండ గేణేష్‌ అనే గ్యాంగ్ స్టర్‌ పాత్రలో అదరగొట్టాడు.ముఖ్యంగా ఎఫ్ 2 సినిమా తర్వాత  తెలంగాణ యాసలో మరోసారి వరుణ్ తేజ్ డైలాగ్ డెలవరి బాగుంది.మరోవైపు సెకండ్ హీరోగా నటించిన అథర్వ లుక్స్ బాగున్నాయి. తమిళంలో యూత్ హీరోగా రాణిస్తున్నఅథర్వ ఈ సినిమాలో మంచి నటననే కనబరిచాడు.ఇక శ్రీదేవి పాత్రలో నటించిన పూజా హెగ్డే ఉండేది కొంచెం సేపైనా,ప్రేక్షకులను తనదైన గ్లామర్‌తో అదరగొట్టింది.ఇక మొత్తానికి టెక్నిషియన్స్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: