Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 2:18 am IST

Menu &Sections

Search

అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !

అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !
అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నందమూరి నట సింహం బాలయ్య బాబు  ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్  కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా  ఈ చిత్రం  ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన  రెగ్యులర్‌ షూటింగ్‌ ను శరవేగంగా పూర్తి చేసుకుంది. తాజాగా  ఈ సినిమా  డబ్బింగ్ ఈ రోజు శబ్ధాలయ స్టూడియోస్‌ లో మొదలైంది.  బాలకృష్ణ  తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. రెండు రోజులు గ్యాప్ వచ్చిందని బాలయ్య డబ్బింగ్ మొదలెట్టారట, ఇది బాలయ్య డెడికేషన్ అంటే. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేసిన సీన్స్ కి మాత్రమే ఈ డబ్బింగ్  చెబుతున్నారు.  ఇక ఫస్ట్  షెడ్యూల్ లో ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు.    ప్లాష్ బ్యాక్ లో ఈ సన్నివేశాలు వస్తాయి.  బాలయ్య  ఓ హోమం జరుపుతుండగా విలన్స్ బాలయ్య పై అటాక్ చేస్తారు. ఈ క్రమంలోనే బాలయ్య వారితో భారీ ఫైట్ చేస్తాడు. ఈ సన్నివేశాలకే ప్రస్తుతం బాలయ్య డబ్బింగ్ చెబుతున్నారు.  కాగా తరువాత జరగబోయే షెడ్యూల్ లో కీలకమైన ఫ్యామిలీ  సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ సన్నివేశాల్లో బాలయ్య - భూమిక చావ్లా మధ్య వచ్చే సీన్స్ తో పాటు  కొన్ని కామెడీ సీన్స్ కూడా  ఉంటాయట. పైగా  ఈ సీన్స్ లో  జయసుధ, రావు రమేష్ కూడా ఉన్నారట.   అయితే ఈ సినిమా గురించి సి కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. 'సినిమాలో బాలయ్య రెండు గెటప్ ల్లో కనిపించనున్నారని.. రెండో గెటప్ లో బాలయ్య ఇంకా యంగ్ లుక్ లో కనిపించనున్నారని.. ఈ లుక్స్ కోసం బాలయ్య రోజుకి ఐదు గంటలు వ్యాయామం చేస్తున్నారని..  చెప్పుకొచ్చారు. ఈ వయసులో కూడా  బాలయ్య ఆ రేంజ్ లో  కష్టపడటం నిజంగా గ్రేటే. ఇక ఇటీవ‌లే  విడుద‌లైన బాలయ్య ఫస్ట్ లుక్‌ కి  ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మరి రెండో లుక్ కి ఇక ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో  చూడాలి.  


కాగా దర్శకనిర్మాతలు  ఈ సినిమాకి రూలర్ అనే  టైటిల్ పెట్టాలని  ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య మళ్లీ పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతున్నాడు.  అయితే ఈ  టైటిల్ కి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  ఇక ఈ చిత్రంలో  రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన  సోనాల్ చౌహాన్ అండ్  వేదిక  హీరోయిన్లుగా  నటించనున్నారు.  అయితే  వేదిక  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.  అలాగే ఓ కీలకమైన పాత్రలో  నమిత కనిపించనుంది.  నమితది  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..  ముఖ్యంగా సినిమాలో  బాలయ్యకి విలన్ గా  కనిపించనుంది.  ఇప్పటికే  సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.  ఇక  ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు.  బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  


Nandamuri Balakrishna starts dubbing for NBK 105   
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.