ఈమధ్య సినిమాల్లో వివాదాస్పదాంశాలు కంటే సినిమాపై వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని అంశాలపై ఆయా వర్గాలు సినిమాపై తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయంటూ అడ్డుకుంటున్నారు. ఈ వివాదాలు ఆయా సినిమాల విడుదలపైనే ప్రభావం చూపిస్తున్నాయి. ఈరోజు విడుదలైన వాల్మీకి సినిమా విషయంలోనూ అదే జరిగింది. అనుకోని పరిస్థితుల్లో రాత్రికి రాత్రి టైటిల్ ను గద్దలకొండ గణేశ్ గా మార్చాల్సి వచ్చింది. ఈ ప్రభావం సినిమాపై ఖచ్చితంగా ప్రభావం చూపేదే.

 

 

కానీ.. ఈ సినిమాకు ముందు నుంచే హైప్ ఉండడం నిర్మాతలకు కలిసి వచ్చింది. ఓపెనింగ్ షో నుంచే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. గద్దలకొండ గణేశ్ గా వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమా మొత్తానికి వరుణ్ క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. దీంతో ఎటువంటి వివాదాలు వచ్చినా కంటెంట్ ఉన్న సినిమా హిట్ ను అడ్డుకోలేరని నిరూపణ అయింది. సినిమా టైటిల్ మార్చగలిగినా సినిమా హిట్ కు అవేమీ ప్రతిబంధకాలు కాలేకపోయాయని మెగా అభిమానులు, సినిమా యూనిట్ సంతోషంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో కూడా.. "సగం సినిమా ఇంటర్నెట్ లో ముందే లీక్ అయినా రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ హిట్ చేసిన ఫ్యాన్స్ మేమున్నాం" అంటూ మెగాభిమానులు ఈ సినిమాకు అండగా నిలవడం గర్వకారణం. చెప్పినట్టుగానే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

 

 

సినిమాపై దర్శకుడు హరీశ్ శంకర్ మొదటి నుంచీ చెప్పినట్టు వివాదాస్పద అంశాలు లేవనే టాక్ వస్తోంది. విడుదలకు ముందు రోజు రాత్రి సినిమా టైటిల్ మార్చటమంటే ఏ నిర్మాత, దర్శకులకైనా టెన్షన్ తప్పదు. నిర్మాత, దర్శకుల్లో ఆ టెన్షన్ ప్రస్పుటంగా కనబడిందనే చెప్పాలి. మొత్తానికి ఈ రోజు ఓపెనింగ్ షోకే వచ్చేసిన టాక్ వారిలో ఆనందాన్ని నింపిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: