టీజర్, ట్రైలర్లు కట్ చేయడంలో మన తెలుగు దర్శకులు బాగా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో ఏదో ఉంది అనిపించే షాట్స్ తీసుకోవడం..ఎడిటింగ్ జిమ్మిక్కులతో వాటికి ఆర్.ఆర్. తో అవసరం లేని బిల్డప్ ని ఇవ్వడం.. కథ గురించి చెప్పకుండా కన్ఫ్యూజ్ చేయడం.. ఇలా సినిమాకు హైప్ పెంచడానికి జనాలు ఏవేవో ఊహించుకోవడానికి ఎన్ని ట్రిక్స్ ప్లే చేయాలో అన్నీ చేస్తున్నారు. అందువల్లే ప్రేక్షకులు సినిమా గురించి ఏదేదో ఊహించుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మతి పోగొడుతున్నాయి. తీరా ఆకాశాన్నంటే అంచనాలతో థియేటర్లకు వెళ్లి.. అక్కడ అనుకున్నంత సీన్ లేకపోయేసరికి తీవ్రంగా నిరాశతో డీలా పడుతు బయటకి వచ్చేస్తున్నారు. ఐతే ఈ అంచనాల వల్ల సినిమాకు తీవ్రమైన నష్ఠం వస్తుందనే ఆలోచన ఫిలిం మేకర్స్ కి రావడం లేదు. 

గత నెల 30 న వచ్చిన 'సాహో' విషయంలో నూటికి నూరు శాతం ఇలానే జరిగింది. ఈ సినిమాకు ప్రోమోలు కట్ చేయడంలో మాత్రం బాగా తెలివిగా వ్యవహరించారు. కానీ ఆ తెలివి సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో కనిపించలేదు. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు షాక్ తో తిరిగి వచ్చారు. 'సాహో'కు రావాల్సిన దానికంటే ఎక్కువ నెగెటివ్ టాక్ రావడానికి అసలు కారణం ఇదే. ఐతే 'సాహో' తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'సైరా' విషయంలో మాత్రం ఈ హడావుడి కనిపించడం లేదు. సినిమా ట్రైలర్ లో కథను పూర్తిగా చెప్పేశారు. సినిమాలో ఏం చూడబోతున్నారో స్పష్టంగా చూపించారు. 

సినిమా క్లైమాక్స్ విషయంలో కూడా ప్రేక్షకుల్ని ముందుగా ప్రిపేర్ చేశారు. 'సాహో' సినిమా లాగా అతి బిల్డప్ ఉన్న సన్నివేశాలు లేవు. ప్రేక్షకులు మరీ అతిగా అంచనాలు పెట్టుకోకుండా.. తాము ఏం తీశామో ట్రైలర్ తోనే దాదాపుగా ఒక అంచనాకు వచ్చేలా చేశారు. కాబట్టే 'సాహో' ట్రైలర్ డీసెంట్ అనిపించింది తప్ప.. ప్రేక్షకుల్లో లేనిది ఊహించుకునేలా చేసి..మహా అద్భుతం అనిపించలేదు. చిరు సినిమా కాబట్టి ఆటోమేటిగ్గా రావాల్సిన హైప్ ఇప్పటికే వచ్చేసింది. అంతకుమించి అంచనాలు పెంచాల్సిన అవసరం లేదని చిత్ర బృందం డిసైడైపోయింది. ఒకవేళ సినిమా రిలీజయ్యాక గనక ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటే మాత్రం బాక్సులు బద్దలవడం ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: