మెగా ఫామిలీ లో ఏ హీరో వచ్చినా ప్లానింగ్ తో , తెలివితో ఇండస్ట్రి లో ఒక స్పెషల్ స్థానం లో ఉండేలా ఇరగదీస్తారు ..సినిమా కథ దగ్గర నుంచి అన్నీ విషయాల్లో మెగా హీరో ల స్టయిల్ అందరికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చిరంజీవి దగ్గర నుంచి వరుణ్ తేజ్ వరకూ ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. తన పెదనాన్న 'సైరా' సినిమా విడుదల కి రెండు వారాల ముందు 'గద్దల కొండ' గణేశ్ అంటూ వచ్చేశాడు వరుణ్ తేజ్..జీగరతాండ అనే తమిళ సినిమా రీమేక్ ని గబ్బార్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకి ఎక్కించాడు.

పవన్ కల్యాణ్ యొక్క ఎనర్జీ ని గబ్బార్ సింగ్ లో హరీష్ ఎలా చూపించాడో ఇప్పుడు వరుణ్ స్టామినా ని హరీష్ బయటకి లాగాడు అనే చెప్పాలి. ఊర మాస్ పాత్రలో తన కెరీర్ లోనే బెస్ట్ సినిమా చేశాడు హీరో వరుణ్ తేజ్..పూజా హెగ్డే రోల్ కూడా చాలా క్యూట్ గా డిసైన్ చేశాడు డైరెక్టర్ హరీష్ కామెడీ మెయిన్  గా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కాస్త డల్ అనిపించినా ఓవర్ ఆల్ గా హిట్టు సినిమా అనే చెప్పుకోవాలి.

మరి మొదటి రోజు వరుణ్ తేజ్ నట్టించిన ఈ సినిమా లెక్కలు ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్ టాపిక్ అయ్యాయి. 'వాల్మీకి' సినిమా బడ్జెట్ కేవలం 22 కోట్లు .. దాదాపు 25 కోట్ల వరకూ ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. వరుణ్ తేజ్ సినిమా లలో ఇదే హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమా .. పాతిక కోట్లు దాటితే ఈ సినిమా హిట్ అని చెప్పుకోవచ్చు .. ఆంధ్ర నైజాం కలిపి మొదటి రోజు ఐదు కోట్లు వసూలు చేసిన గద్దల కొండ .. వరల్డ్ వైడ్  7.5 కోట్లు కలక్ట్ చేసింది .. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ కల్లెక్షన్ .. బయట పబ్లిక్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది , సాధారణంగా ఫామిలీ ఆడియన్స్ వరుణ్ తేజ్ ని బాగానే ఇష్టపడతారు సొ ఈ మౌత్ టాక్ తో లేడీస్ గనక థియేటర్ లకి చేరుకుంటే మిగితా 17 కోట్లు రాబట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. సో  వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ తో బ్లాక్ బస్టర్ గట్టిగానే కొట్టబోతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: