ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు కంగనా రనౌత్. చెప్పాలంటే ఈ మధ్య సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ని అందరు మర్చిపోయారనే చెప్పాలి. అంతగా కంగనా ఫాం లో ఉంది.బాలీవుడ్ రౌడీ క్వీన్ కంగనరనౌత్ ప్రస్తుతం కంగన ఓ భారీ మిషన్ ని చేపట్టింది. పురుచ్చితలైవి .. ఐరన్ లేడీ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం తలైవితో సంచలనం సృష్టించబోతోంది. ఈ సినిమాకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా బెంగళూరులో ప్రారంభం కానుందని లేటెస్ట్ అప్‌డేట్. ఇప్పటికే జయలలిత లుక్ కోసం అమెరికా లాస్ ఏంజెల్స్ కి వెళ్లిన కంగన మేకప్ టెస్ట్స్ ని మొదలుపెట్టింది. అమ్మ లుక్ ఎలా వుండాలి? హావభావాల్ని ఎలా పలికించాలి? అన్న విషయాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన కంగన మేకప్ టెస్టులతో క్లారిటీకి వస్తోంది. 

ఏదైనా అనుకున్నది సాధించాలంటే కంగన తర్వాతే ఏ హీరోయిన్ అయినా అన్న విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. కమిటయిన పాత్ర కోసం ఏదైనా చేయగలిగిన సత్తా కంగనాకే ఉంది. ఇక అమ్మ లుక్ టెస్ట్ కోసం కెప్టెన్ మార్వెల్- బ్లేడ్ రన్నర్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కొలిన్స్ పర్యవేక్షణలో ప్రోస్తటిక్ మేకప్ టెస్ట్ జరుగుతోంది. రకరకాల లుక్స్ ని ట్రై చేస్తూ అమ్మ పాత్ర కోసం కంగన సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్- గ్రీన్- బ్లూ కలర్ ప్రోస్తటిక్ మేకప్ లో కంగన కనిపిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. తలైవి సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి జయలలిత పాత్రని కంగన ఎలా పోషిస్తుంది?. ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుంది? అనే ఆసక్తి అందరిలోను మొదలైంది. 

ఇప్పటికే ఈ సినిమా కోసం కంగన తమిళ భాషతో పాటు భరతనాట్యం నేర్చుకుంటోంది. భారీ క్యాస్టింగ్ తో అత్యంత భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని అక్టోబర్ లో ప్రారంభించబోతున్నారు. కేవలం ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా కాకుండా పాన్ ఇండియన్ సినిమాగా భారీ స్థాయిలో ప్రేక్షకులకు అందిస్తామని నిర్మాత విష్ణు ఇందూరి తెలిపారు. అంతేకాదు ఇందులో కీలక పాత్రల కోసం దక్షిణాదికి చెందిన టాప్ స్టార్స్ ని సంప్రదిస్తున్నారట. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమితాబ్, అమీర్, షారుఖ్, సల్మాన్ వంటి వాళ్ళ సినిమా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతుండటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: