ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా, నెగటివ్ టాక్ తో రన్ అయి చాలావరకు బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టినట్లు ఇప్పటికే పలు వార్తలు వెలువడుతున్నాయి. ఇకపోతే ఆ సినిమా తరువాత ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా, రిలీజ్ రోజు నుండి మంచి టాక్ తో దూసుకుపోసాగింది. అయితే మొదట్లో అద్బుతమైన కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు రానురాను విపరీతంగా కలెక్షన్ డ్రాప్స్ మొదలయ్యాయి. అవి ఎంతలా అంటే, ఊహించని స్థాయిలో అన్నమాట. నిజానికి కంటెంట్ పరంగా అదరగొట్టి మంచి ఎంటర్టైనింగ్ గా సాగిన గ్యాంగ్ లీడర్ పై ఎక్కడా కూడా నెగటివిటీ లేదు, 

కానీ ఈ సినిమాకు చాలా చోట్ల దారుణమైన నష్టాలు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటికే నైజాం, ఓవర్సీస్, మరియు మన రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చాలావరకు చతికిల పడిన ఈ సినిమా, నేడు గద్దలకొండ గణేష్, బందోబస్త్ సినిమాల రిలీజ్ తరువాత మరింతగా నత్తనడకన సాగుతున్నట్లు చెప్తున్నారు. ఇక నేడు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో బందోబస్త్ యావరేజ్ టాక్ ని  సంపాదించగా, వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ మాత్రం, మంచి మాస్ హిట్ గా టాక్ ని సంపాదించింది. అయితే ఈ సినిమా ప్రభావం గ్యాంగ్ లీడర్ ఫై రేపటినుండి మరింతగా పడనుందని తెలుస్తోంది. మరోవైపు గ్యాంగ్ లీడర్ కు చాలాచోట్ల థియేటర్లు కూడా తగ్గించే పరిస్థితులు కూడా కనపడుతున్నట్లు సమాచారం. 

మొత్తంగా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, ఇప్పటివరకు కేవలం రూ.17 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఇక రాబోయే అతి కొద్దిరోజుల్లోనే ఈ సినిమా క్లోజ్ అవ్వడం ఖాయమనే టాక్ కూడా గట్టిగా వినపడుతోంది. నిజానికి తొలిరోజు తొలిఆట నుండి ఎంతో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, రానురాను ఇంత దారుణమైన కలెక్షన్స్ సాధించడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి రాబోయే మరికొద్దిరోజుల తరువాత ఓవర్ ఆల్ కలెక్షన్స్ ని బట్టి చూస్తేనే గ్యాంగ్ లీడర్ ఎంతవరకు రాబట్టాడు అనేది చెప్పలేమని అంటున్నారు విశ్లేషకులు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: