కొన్ని సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళుతున్నాయో కూడా తెలియకుండా రిలీజ్ అవుతున్నాయి. కారణం ఆ సినిమాలకు వెనక ఉండి నడిపించే పెద్ద నిర్మాతల అండ దండలు లేకపోవడం ఒక కారణం అయితే పబ్లిసిటి విషయంలో వీక్ గా ఉండటం. పేరున్న నటులైన, పాపులర్ రైటర్స్ ఉన్న సినిమాకి సరైన ఆదరణ లభించదు. ఇది ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సాగుతున్న వ్యవహారమే. శకలక శంకర్ లాంటి వాళ్ళు హీరోగా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడుతున్నది ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము. కమెడియన్ సప్తగిరి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో ప్రముఖ కమెడియన్ వచ్చి చేరాడు.

అవును మహేష్ ఇపుడు అక్కినేని నాగార్జున కి వీరాభిమానిగా మారిపోయాడు. ఆయన నటించిన సినిమాలో నాగ్ ఫ్యాన్‌గా నటించాడు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో కొంత మంది హీరోలు..వేరే కథానాయకులు అభిమానులుగా నటిస్తున్నారు. ఇపుడు అదే కోవలో మహేష్ ..నాగార్జున అభిమానిగా మారిపోయాడు.ఇక్కడ మహేష్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మహేష్ అనగానే అందరికి సూపర్ స్టార్ మహేష్ గుర్తు రావడం కామన్. కానీ ఈ మహేష్ 'రంగస్థలం' సినిమాలో కమెడియన్‌గా ఫేమస్ అయిన మహేష్..ఇపుడు హీరో అయిపోయాడు. 

'నేను నా నాగార్జున' అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మహేష్ .నాగార్జున అభిమానిగా నటించడమే కాదు...నాగార్జున గారిపై అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేసేలా ఈ సినిమాను నిర్మించడం విశేషం. నాగేశ్వరరావు నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాను ఆర్.బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. కామెడి, సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ చక్కగా నటించాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. కాకపోతే చిన్న సినిమా కావడంతో థియోటర్స్ దొరక్క జనాలకు చేరలేకపోతోంది ఈ సినిమా. 


మరింత సమాచారం తెలుసుకోండి: