వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన వాల్మీకి అదే చివరి నిమిషంలో పేరు మార్చుకున్న గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ కు జోడీగా పూజా హెగ్దె నటించింది. అదికూడా పూజా మెరుపులు కొద్దిసేపే ఉన్నాయి. ఇక సినిమా మొత్తం తన క్యూట్ లుక్స్  తో అలరించింది కొత్త అమ్మాయి మృణాళిని.


తమిళంలో డబ్ స్మాష్ తో చాలా ఫేమస్ అయిన ఈ అమ్మడికి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు హరీష్ శంకర్. మొదటి సినిమా అవకాశమే అయినా ఆమె తన నటనతో కుర్రాళ్ల మనసు దోచేసింది. సినిమాలో బుజ్జమ్మ పాత్రలో నటించింది మృణాళిని అయితే అభితో లవ్ లో పడే బుజ్జమ్మ అదే మన మృణాళిని గుడిలో గద్దలకొండ గణేష్ ఉన్నాడన్న ధైర్యంతో అభిని టచ్ చేయమని రెచ్చగొడుతుంది.


అప్పుడు అమ్మడు ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ చూసి అమ్మడికి మంచి కెరియర్ ఉంటుందని ఫిక్స్ అవొచ్చు. కొత్త పిల్లే అయినా ఏమాత్రం కన్ ఫ్యూజన్ లేకుండా తనకు ఇచ్చిన పాత్రను పర్ఫెక్ట్ గా చేసింది. అయితే చివర్లో బుజ్జిని గద్దలకొండ గణేష్ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం అభి తన ప్రేమను దక్కించుకునేందుకు బుజ్జమ్మని ఎత్తుకెళ్లడం జరుగుతుంది.


ఇక రీమేక్ స్పెషలిస్ట్ గా హరీష్ శంకర్ ఎలాంటి సినిమానైనా సరే తన దగ్గరకు వస్తే దాని రూపురేఖలు మార్చేస్తాడని గద్దలకొండ గణేష్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. మొత్తానికి హరీష్ శంకర్ మరోసారి తన డైరక్షన్ టాలెంట్ ఏంటో చూపించాడు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడినట్టే అని చెప్పుకోవచ్చు. చివరి నిమిషంలో టైటిల్ మారినా సరే ప్రేక్షకులు ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు.      


మరింత సమాచారం తెలుసుకోండి: