అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘సాహో’ ప్రేక్షకులను మెప్పించ లేకపోవడంతో ఈ మూవీ బయ్యర్లకు దాదాపు 40 శాతం పైగా నష్టాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని ఏరియాలలో అయితే ఈ మూవీ బయ్యర్లకు 50 శాతం వరకు నష్టాలు వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇప్పుడు ఈ విషయాలు అన్నీ రాజమౌళికి అనుకోని సమస్యలు తెచ్చి పెట్టాయి అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచరం మేరకు ఇప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాత దానయ్య ఈ మూవీ నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ విషయంలో ఎప్పుడు పట్టించుకోలేదనీ అయితే ‘సాహో’ ఫలితం తరువాత దానయ్య ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు టాక్.

అంతేకాదు ఈ మూవీ కథ రీత్యా ఎన్ని సీన్స్ అవసరమైతే అన్ని సీన్స్ మాత్రమే తీయమని అనవసరపు సీన్స్ తీసి ఈ మూవీ బడ్జెట్ పెంచవద్దని దానయ్య సున్నితంగా రాజమౌళికి సూచనలు ఇచ్చినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈ అనుకోని సూచనకు రాజమౌళి కూడ షాక్ అయ్యాడు అని అంటున్నారు. 

‘సాహో’ నిర్మాణంలో ఆ కథకు సంబంధం లేకుండా దర్శకుడు సుజిత్ అనేక అనవసరపు భారీ బడ్జెట్ సీన్స్ తీసి ఆ తరువాత ఎడిటింగ్ లో కట్ చేయడం వల్ల ‘సాహో’ బడ్జెట్ విపరీతంగా పెరిగి పోయింది అన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కు కూడ అటువంటి సమస్యలు రాకుండా దానయ్య ఇలాంటి సూచనలు రాజమౌళికి ఇచ్చి ఉంటాడు అని అంటున్నారు. దీనితో జరుగుతున్న ఈ పరిణామాలను గ్రహించిన రాజమౌళి భవిష్యత్ లో తాను ఇక అత్యంత భారీ సినిమాలకు దూరంగా ఉంటే మంచిది అన్న అభిప్రాయం తనకు కలిగింది అంటూ తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేసినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: