సినిమా సెలెబ్రెటీలకు సెంటిమెంట్స్ సర్వసాధారణం. అయితే రొటీన్ సినిమాలకు అదేవిధంగా రొటీన్ నటనకు దూరంగా ఉండే విజయ్ దేవరకొండ కూడ సెంటిమెంట్ కు తన ఒగ్గడం ఆశ్చర్యంగా మారింది. విజయ్ నటించే సినిమాలలో ముఖం మీద గాయాలు ఉండి ఆగాయాలను కవర్ చేస్తూ ప్లాస్టర్ వాడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఈ యాంగ్ హీరో నమ్మకం అని అంటున్నారు.

తనకు టాప్ హీరో ఇమేజ్ ని తీసుకు వచ్చిన అర్జున్ రెడ్డి నుండి లేటెస్ట్ గా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ వరకు అవకాశం వచ్చినప్పుడల్లా విజయ్ తన ముఖం పై గాట్లు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇతడి లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో కూడ రిపీట్ కాబోతోంది. 

క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ తనకు ఎంతో పేరు తీసుకువచ్చిన ‘అర్జున్ రెడ్డి’ గెటప్ ను తిరిగి రిపీట్ చేయడం ఈ సెంటిమెంట్ లో భాగమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొడవు జుట్టు మాసిన గడ్డం ముఖం పైన రక్తపు మరకలతో కాస్త వయొలెంట్ గా కనిపిస్తూ పై బటన్లు వదిలేసిన షర్టు చేతిలో సిగరెట్ తో నోట్లో నుంచి పొగ వదులుతూ ‘అర్జున్ రెడ్డి’ లుక్ ను తిరిగి విజయ్ రిపీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.  

ఇంటెన్స్ క్యారెక్టర్లు చేయడంలో విజయ్ కి మంచి పేరుంది. దీనితో తిరిగి తన లేటెస్ట్ మూవీ  'వరల్డ్ ఫేమస్ లవర్' ని ‘అర్జున్ రెడ్డి’ కి సీక్వెల్ గా మారుస్తున్నాడా అన్న సందేహాలు కలగడం సహజం. ఈ మూవీలో రచయితగా కనిపించే విజయ్ నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తూ ఆ అనుభవాలను వాస్తవ కథలుగా వ్రాసే రచయిత పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు క్రాంతి మాధవ్ మంచి ఫీల్ ఉన్న సినిమాలు తీస్తాడని పేరుంది. అయితే ‘డియర్ కామ్రేడ్’ పరాజయంతో షాక్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ మూవీ కథలో మార్పులు చేసి తిరిగి తనకు కలిసి వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ కథను మరొక విధంగా చూపించబోతున్నాడా అంటూ విజయ్ పై సెటైర్లు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: