మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వాల్మీకి) శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కోలీవుడ్‌లో సిద్ధార్థ్ హీరోగా తెర‌కెక్కి హిట్ అయిన ఈ సినిమాను హ‌రీష్ శంక‌ర్ రీమేక్ చేశారు. ముందుగా వాల్మీకి అనే టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై కొన్ని కులాలు టైటిల్ మార్చాల‌న్న అభ్యంత‌రం పెట్టాయి. దీంతో రిలీజ్‌కు ముందు రోజు వాల్మీకి కాస్త గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌గా మార్చింది యూనిట్‌.


ఇక డీజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ లాంగ్ గ్యాప్ తీసుకుని కోలీవుడ్‌లో హిట్ అయిన సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. నైజాంలో గద్దలకొండ గణేష్ మొదటిరోజు 1.7కోట్ల షేర్ సాధించి అబ్బురపరిచింది. ఈ మొత్తం వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ కావడం విశేషం.


ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 6.81 కోట్ల షేర్ రాబ‌ట్టింది. తొలి రోజు ఈ సినిమాకు ఇవి మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 5.81 కోట్లు రాబ‌ట్టింది. ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి. ఇక ఈ సినిమా తొలి రోజు వ‌సూళ్లు చూస్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రింత‌గా దూసుకుపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌రుణ్ కెరీర్‌లో మ‌రో మంచి హిట్ ప‌డిన‌ట్టే.


గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వాల్మీకి) ఫ‌స్ట్ డే షేర్ (రూ.కోట్ల‌లో) :
నైజాం - 1.86
సీడెడ్ - 0.81
వైజాగ్ - 0.70
ఈస్ట్ - 0.54
వెస్ట్ - 0.58
కృష్ణా - 0.41
గుంటూరు - 0.71
నెల్లూరు - 0.20
-----------------------------------
ఏపీ+తెలంగాణ = 5.81 కోట్లు
-----------------------------------
రెస్టాఫ్ ఇండియా - 0.42
రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ - 0.58
-------------------------------------
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే షేర్ = 6.81
-------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: