మెగాస్టార్ చిరంజీవి  నటించిన  పీరియాడికల్ మూవీ  సైరా మరి కొద్దీ రోజుల్లో  థియేటర్లలోకి రానుంది.  ఇక ఈ చిత్రానికి ఎక్కడలేని  హైప్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ లోని కొందరు వ్యక్తులు  చీప్ పబ్లిసిటీ స్టంట్ చేశారు.  కొద్దీ రోజుల క్రితం ఈచిత్రంయొక్క  శాటిలైట్ హక్కులు 125కోట్లకు  అమ్ముడైయ్యాయని ఈహక్కులను  జీ నెట్వర్క్  సొంతం చేసుకుందని వచ్చిన వార్తలు  టాలీవుడ్  ను షేక్ చేశాయి. బాహుబలి లాంటి సినిమాకే సాధ్యం కానీ రికార్డు ఈచిత్రానికి  సాధ్యమయ్యిందనే విషయం ఆశ్చర్యం కలిగించింది. 


అయితే  తాజాగా  జీ  నెట్వర్క్  యాజమాన్యం సైరా శాటిలైట్ , డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. అసలు నిజమేంటంటే సౌత్ లోని  అన్ని భాషలకు కలిపి ఈచిత్రం యొక్క  శాటిలైట్ హక్కులను  25కోట్లకు సొంతం చేసుకుంది సన్ నెట్వర్క్.  ఇక డిజిటల్ హాక్కులు మొదట అమెజాన్  ప్రైమ్ కు 40కోట్ల కు అమ్మారని వార్తలువచ్చాయి ఆతరువాత జీ 5 ఈహక్కులను  భారీ మొత్తానికి సొంతం చేసుకుందని రూమర్లు వచ్చాయి.అయితే  డిజిటిల్ హక్కుల విషయంలో ఇంకా  క్లారిటీ రావాల్సివుంది కానీ  20కోట్లలోపే  ఈడీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.


మొత్తంగా చేసుకుంటే సైరా  నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి 50-60కోట్ల  మధ్యనే జరిగింది.  అంత మాత్రానికి 125కోట్ల బిజినెస్ చేసిన సౌత్ ఇండియా మొదటి సినిమా సైరానే అంటూ  హడావిడి చేసి  దొరికిపోయింది ఆసినిమా యూనిట్. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం  సినిమా ఫై భారీ అంచనాలను తీసుకొచ్చింది. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 2 న తెలుగు తోపాటు కన్నడ, మలయాళ ,తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: