మెగాస్టార్‌ అంటే ఓ ప్రభంజనం.ఓ సంచలనం. పిచ్చి పిచ్చిగా ప్రేమించే ఫాన్స్‌ కోసం డాన్స్‌లు ఇరగదీసే నైజం అతనిది.అభిమానుల్ని ఆనందపెట్టడానికి ఎంతకైనా తెగించే ధీరత్వం.ఈ లక్షణాలే చిరంజీవికి మెగాస్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టాయనడంలో సందేహం లేదు.ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. మొదలు పెట్టినప్పటినుండే సంచనాలకు కేంద్రబిందువుగా మారింది.ఆ సంచనాలనే కంటిన్యూ చేస్తూ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంలో ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌కు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్‌ ఇండ్రస్ట్రీలో సెంటులాగ స్ప్రెడ్ అవుతున్నాయి.



తాజాగా సైరా డిజిటల్‌,శాటిలైట్‌ రైట్స్‌కు సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.సైరా డిజిటల్‌ హక్కులు 40 కోట్లకుపైగా ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల శాటిలైట్‌ హక్కులు అన్ని కలిపి 70 కోట్లకు పైగా పలికాయట.అంటే కేవలం డిజిటల్‌,శాటిలైట్‌ హక్కుల ద్వారా సైరా 100 కోట్లకు పైగా బిజినెస్‌ చేసింది.ఇక థియెట్రికల్‌ బిజినెస్‌ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం అన్న టాక్‌ వినిపిస్తోంది.ఇక ఇప్పటికే చిరంజీవి అభిమానులంతా‘సైరా’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రోజులు రిలీజ్‌కు దగ్గర పడుతున్నకొద్ది ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అవుతున్నట్లుగా  కనిపిస్తుంది..



అందుకే ఇంతలా అభిమానించే అభిమానులకోసం ‘సైరా’ సినిమాలో చిరంజీవి అనేక స్టంట్స్‌ను పెర్ఫామ్‌ చేశారు.ఎన్నో రిస్కీ స్టంట్స్‌ను డూప్‌ లేకుండా పెర్ఫామ్‌ చేశారు.చిరంజీవి ఒక్కసారి పాత్రలోకి లీనమయ్యాక తనకు తన వయసు అనేది అడ్డంకిగా మారదని నిరూపించాడు.యాక్షన్‌ సీక్వెన్సెస్‌ కోసం కత్తి యుద్ధం అలాగే హార్స్‌ రైడింగ్‌ వంటివి తాను ఎంతో సులభంగా చేయగలిగారు.అందుకే చిరంజీవి సినిమా రిలీజ్‌ అవుతోందంటే కులాలు,మతాలు,ప్రాంతాలకతీతంగా అభిమాన జనానికి పండుగ సందడి.మెగాస్టార్‌ సినిమా థియేటర్స్‌లో హల్చల్‌ చేస్తోందంటే జాతరే.భారీ కటౌట్లతో థియేటర్‌ ప్రాంగణమంతా రంగురంగు విద్యుత్‌ దీప తోరణాల మధ్య కళకళ లాడుతుంది..ఇది చిరు స్టామినా..

మరింత సమాచారం తెలుసుకోండి: