టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రిలీజ్ అయిన లేటెస్ట్ సినిమా గద్దలకొండ గణేష్, ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇటీవల తమిళ్ లో వచ్చిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వచించగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించడం జరిగింది. తన కెరీర్ లో మొదటిసారి గద్దలకొండ గణేష్ అనే మాస్ రోల్ లో నటించిన వరుణ్ తేజ్, ఆ రోల్ లో అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి, ఆడియన్స్ తో శభాష్ అనిపించుకుంటున్నాడు. 

కేవలం మెగాఫ్యాన్స్ మరియు సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాక కొందరు సినిమా ప్రముఖులు సైతం ఈ సినిమాపై అలానే వరుణ్ నటనపై ప్రశంశలు కురిపిస్తున్నారు. మన రెండు తెలుగురాష్ట్రాల్లోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా, ఓవర్సీస్ లో మాత్రం నత్తనడకన ముందుకు నడుస్తోంది. అంతేకాక ఈ సినిమాకు అక్కడ ఓపెనింగ్స్ కూడా చాలా దారుణంగా వచ్చినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వారు చెప్తున్న వివరాల ప్రకారం, ఈ సినిమా పీమియర్ల ద్వారా కేవలం 75,000 డాలర్లు మాత్రమే వసూలు చేసిందట. ఇది వరుణ్ తేజ్ ప్రీవియస్ మూవీ ‘అంతరిక్షం’ ఓపెనింగ్స్ కంటే చాలా తక్కువట. వరుణ్ తేజ్ సినిమాలు ఇదివరకు అక్కడ బాగానే కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, 

గద్దలకొండ గణేష్ కు అక్కడ సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లనే ఓపెనింగ్స్ తగ్గాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న పాజిటివ్ టాక్ మూలాన వారాంతంలో ఈ వసూళ్లు పుంజుకునే వీలుందట. ఎక్కువగా క్లాస్ మరియు ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ సాదిస్తుంటాయని, అయితే ఇది పక్కా మాస్ సినిమా అని టీజర్, ట్రైలర్ రిలీజ్ తరువాత కొంత ముద్ర పడడం కూడా ఓపెనింగ్స్ తగ్గడానికి ఒక కారణం కావొచ్చట. మరి విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగా మన గద్దలకొండ గణేష్, ఓవర్సీస్ లో రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్ రాబడతాడో వేచి చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: