తెలుగులో అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలో ఫస్ట్ సాంగ్ చేసిన బ్యూటీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండీ.. బాలకృష్ణ – పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన పైసా వసూల్ లో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన భామే. ఇంతకీ అమ్మడు పేరు చెప్పలేదు కదూ.. ఆమె పేరు కైరా దత్. ఈ బెంగాల్ బ్యూటీ నటించింది అతి తక్కువ సినిమాల్లోనే అయినా మోడలింగ్ లో టాప్ గానే ఉంటోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తన లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేస్తూ యువతను గిలిగింతలు పెడుతూంటుంది. ప్రస్తుతం తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ పిక్ పోస్ట్ చేసింది. బ్రౌన్ కలర్ బికినీలో ఉన్న తన హాట్ ఫోటోను అప్లోడ్ చేసి యువత గుండెల్లో గుబులు రేపుతోంది. తనకు తాను రాయల్ బెంగాల్ టైగర్ గా చెప్పుకునే కైరా ఈ పోస్ట్ చేసి.. ‘బెంగాల్ టైగర్’ అనే క్యాప్షన్ నే రాసుకుంది. అందుకు తగ్గట్టుగానే తన టూ పీస్ బికినీని పులి చర్మం డిజైన్ ఉండేలా చూసుకుంది. దీంతో ఈ ఫోటోలో కైరా సెక్సీగా కనిపిస్తోంది. చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో అమ్మడికి అభిమానుల ఫాలోయింగ్ బాగానే ఉంది.

ప్రస్తుతం మెక్సికోలో వెకేషన్ లో ఉన్న కైరా.. మధుర్ బండార్కర్ హాట్ గర్ల్స్ క్యాలెండర్ లో ఫేమస్. థమ్స్ అప్, మెర్సిడెస్ బెంజ్, కింగ్ ఫిషర్.. వంటి బ్రాండ్స్ లో నటించింది. 2009లో రణబీర్ సింగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కైరా పెద్దగా సినిమాల్లో నటించింది లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని, తెలుగు సినిమాలతో ఈ భామ లైమ్ లైట్ లోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: