ఆగస్టు నెల 30వ తేదీన సాహో సినిమా విడుదలైంది. దాదాపు 350కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 300 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకోగా శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో 100 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ సాహో సినిమా రిలీజైన రోజునే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. నెగిటివ్ టాక్ రావటంతో ఈ సినిమా బాలీవుడ్ లో మాత్రమే బ్రేక్ ఇవెన్ కాగా మిగతా అన్ని చోట్ల భారీగా నష్టాలను మిగిల్చింది. 
 
సాహో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు హిందీ మినహా మిగతా భాషల్లో 70 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు సమాచారం. సాహో కాకుండా టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు సైరా నరసింహారెడ్డి మరియు ఆర్ ఆర్ ఆర్. సైరా నరసింహారెడ్డి మరో పది రోజుల్లో దసరా పండుగ కానుకగా విడుదల కాబోతుంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ 2020 జులై 30వ తేదీన విడుదల కాబోతుంది. 
 
సాహో సినిమా నిర్మాతలకు నష్టాలను మిగల్చటంతో ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య రాజమౌళిని వీలైనంత తక్కువ బడ్జెట్లో తీయమని చెప్పాడని, అవసరం ఉన్న మేరకు మాత్రమే సీన్లు షూట్ చేయాలని నిబంధనలు పెట్టాడని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలో ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. రాజమౌళి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు ఎప్పుడూ నష్టాలు రాలేదు. 
 
రాజమౌళి సినిమాలకు భారీ బడ్జెట్ ఖర్చు అయినప్పటికీ సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రాజమౌళి తెరపై కనిపించే విధంగా సినిమా తీస్తాడు. రాజమౌళి ఎప్పుడూ వృథాగా డబ్బులు ఖర్చు పెట్టినట్లు వార్తలు కూడా ఎప్పుడూ రాలేదు. సాహో నష్టాల వలన రాజమౌళికి దానయ్య రూల్స్ పెట్టాడని వస్తున్న వార్తలు పుకార్లే తప్ప నిజం కాదని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: