టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ మూవీకి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. ఆ మద్య అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మరోసారి ఊరమాస్ సినిమా తీసి తానేంటో నిరూపించుకున్నాడు.  కాకపోతే ఈ మూవీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది.  అప్పటి నుంచి సరైన కథ కోసం వెతుకుతున్న హరీష్ శంకర్ తమిళంలో హిట్ అయిన  ‘జిగార్తండా’ రిమేక్ చేయాలని ప్రిపేర్ అయ్యారు.

అయితే ఈ మూవీలో హీరో విలన్ షేడ్స్ లో కనిపిస్తాడు..మరి అలాంటి పాత్ర కోసం ఎవరు ముందుకు వస్తారన్న ఆలోచనలో ఉన్న సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఈ కథ వినిపించాడట.  అప్పటి వరకు క్లాస్ లుక్, లవర్ బాయ్ గా కనిపించిన వరుణ్ తేజ్ తనకు మాస్ ఇమేజ్ వస్తుందని ఈ మూవీకి ఓకే చెప్పాడట.  మొత్తానికి వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వాల్మీకి' సినిమా టైటిల్ ను 'గద్దలకొండ గణేష్' గా నిన్న రిలీజ్ చేశారు.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ వచ్చింది.   దీంతో చిత్రబృందం వెంటనే సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వచ్చే కొత్త దర్శకులకు ఓ సలహా కూడా ఇచ్చారు. సినీ పరిశ్రమలో అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు..మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒక్కోసారి మనకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూసి వదిలేసుకుంటూ ఉంటాం.. కానీ  ఆ అవకాశాలు మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అనిచూడకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోవాలి. 

మనకు నచ్చిన పని వదిలేసే వేరే పని చూసుకోవడం అనేది మనల్ని మనం కించపరుచుకోవడం వంటిదని అన్నారు. తాను దర్శకుడిగా ఎన్నో సినిమాలు తీయాలని ఆలోచించినా కుదరలేదు..కానీ తాను మాత్రం ఎప్పుడూ నిరాశ పడలేదు. మనకు నచ్చిన పనిని వేరే పని కోసం వదులకుంటే దాన్ని కాంప్రమైజింగ్ అంటారు. అదే చిన్న మార్పులు చేసుకుని ఆ పనిని పూర్తి చేసినపుడు మన టాలెంట్ ఏంటో బయట పడుతుందని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: