Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:18 pm IST

Menu &Sections

Search

"వాల్మీకి" టైటిల్ మార్పు వెనుక అనంతపురం ఎంపీ!

"వాల్మీకి" టైటిల్ మార్పు వెనుక అనంతపురం ఎంపీ!
"వాల్మీకి" టైటిల్ మార్పు వెనుక అనంతపురం ఎంపీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా టైటిల్ వివాదం నుంచి గట్టెక్కింది. వాల్మీకి నుంచి గద్దలకొండ గణేశ్ గా టైటిల్ ను మార్చారు. అయితే ఈ టైటిల్ మార్పు వెనుక పెద్ద కసరత్తే జరిగిందంటున్నారు. దీనిపై వైసీపీ అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలిసి మాట్లాడారని సమాచారం.

 

 

 

దీనిపై ఓ చానెల్ తో ఎంపీ రంగయ్య మాట్లాడుతూ “వాల్మీకి వల్లే రామాయణం మనకు దైవం అయింది. అటువంటి పేరును ఫ్యాక్షన్ మూలాలతో తీస్తున్న సినిమాకు ఎలా పెడతారనేదానిపై మాకు అభ్యంతరాలున్నాయి. మొత్తానికి సినిమా టైటిల్ ను వాల్మీకి నుంచి గద్దలకొండ గణేశ్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం. మాకు ఎవరిపైనా శత్రుత్వం లేదు” అని అన్నారు. టైటిల్ లో ఉన్న గన్ మార్చాలంటూ మొదలైన వివాదం మొత్తంగా టైటిల్ నే మార్చాలనే వరకూ వచ్చింది. వాల్మీకి, బోయ సంఘాలు దీనిపై ధర్నాలు కూడా చేశారు, కోర్టుకు కూడా వెళ్లారు. దీనిపై దాఖలైన పిటీషన్ ను హైకోర్టు  బెంచ్ కొట్టేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న నిర్మాతలకు కర్నూలు, అనంతపురంలో సినిమా విడుదలవ్వటం లేదని వార్తలు రావడంతో అప్పటికప్పుడు సినిమా టైటిల్ మార్చారు.

 

 

 

నిజానికి ఓ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందితే రిలీజ్ కు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు అని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది. కానీ ఈ నిబంధనను దాటి పలు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మొన్నామధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదంలోనూ ఇదే జరిగింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందినా ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. గద్దలకొండ గణేశ్ గా టైటిల్ మార్చుకున్న వాల్మీకి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

valmiki-movie-title
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మన సినిమాలకే ఖాళీ లేదు.. మధ్యలో ఈ తమిళోళ్ల గోలేంటి!
కొత్త బిజినెస్ లోకి ఎంటరవుతున్న త్రివిక్రమ్
మగధీరలా ఉన్న 'బ్రహ్మాజీ' రౌద్రం చూడాలని ఉందా!
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మబలిదానంపై పవన్ స్పందన
బన్నీపై సినీ కార్మికుల ఫైర్! బ్యానర్ లో ఏం రాసారంటే..
'హీరోయిన్ల పరిస్థితి ఇంతే' అంటున్న మాజీ నటి
చిరంజీవి-పవన్-చరణ్ లకు మాత్రమే సాధ్యమైన రికార్డు.. ఇదే
నైజాంలో చిరంజీవి సత్తా చాటిన సైరా కలెక్షన్లు
చిరంజీవి విషయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి క్లారిటీ!
నన్నయ్య వర్శిటీ ఆరోపణలపై వీసీ స్పందన ఇదే!
చంద్రబాబూ.. మీరేం శోభన్ బాబు కాదు: వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాధ్
అధికారుల తీరుపై పాలకొల్లు ఎమ్మెల్యే వినూత్న నిరసన
పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్: సీఎం జగన్
బికినీలో మెరిసిపోతున్న గోదావరి బ్యూటీ
ఆర్మీ కోసం 'సైరా' ప్రత్యేక ప్రదర్శన
రష్మిక - విజయ్ దేవరకొండ లిప్ లాక్ పై హరిప్రియ కామెంట్స్
వరంగల్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తం!
బర్త్ డే స్పెషల్: 'రాజమౌళి' ఈ పేరే ఒక బ్రాండ్..
'మోదీ'పై వ్యాఖ్యలు.. సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
ఇకపై చిరంజీవి దృష్టి పాన్ ఇండియా సబ్జెక్టులపైనేనా!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.