మునపటి సీజన్ల మాదిరే ఈ సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇంటికి దూరంగా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చి సుమారుగా 60 రోజులు అయిపోయాయి కాబట్టి తమ వారిని చూసే సరికి ఎమోషన్ అవ్వడం కామనే. ఏడ్వడమూ ఇంకా సహజం. ప్రస్తుతం హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్లకు సంబంధించిన ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు. ఇప్పటి వరకు అంత బాగానే ఉంది అయితే వచ్చే వచ్చారు కానీ వాళ్లను డైరెక్ట్‌గా ఇంటి సభ్యుల్ని కలవకుండా వాళ్లకీ ఓ టాస్క్ పెట్టారు బిగ్ బాస్.      ఈ పది మందిలో ఇద్దరికి మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లను కలిసే అవకాశం ఉందని అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుందని వాళ్లకు ఇచ్చిన బాక్స్‌లలో బిగ్ బాస్ ఐ గుర్తు వచ్చిన వాళ్లు మాత్రమే ఇంటి సభ్యుల్ని కలిసే అవకాశం జోకర్ వస్తే తమ వాళ్లను కలకుండానే వెళ్లిపోవాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.

అంటే ఈ 10 మందిలో 5 గురికి ఐ గుర్తు ఉన్న బాక్స్‌‌లు వస్తే మరో 5 గురికి జోకర్‌లు వస్తాయన్నమాట. ఈ ఐ గుర్తు వచ్చిన వాళ్లలో ఇద్దరికి మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా చాలా రోజుల తరువాత తమ కుటుంబ సభ్యుల్ని చూసిన కంటెస్టెంట్స్ అపుకోలేనంత భావోద్వేగానికి లోనయ్యారు.ముఖ్యంగా అందరి సంగతి అటుంచితే శ్రీముఖి తన తమ్ముడు సుసృత్‌ని చూసి గళ గళ ఏడ్చేసింది. వాళ్లతో మాట్లాడ కూడదు, చర్చించకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ శ్రీముఖి గట్టిగా ఏడ్చేసింది. ద్రువదృష్ట శాతం శ్రీముఖి తమ్ముడికి బాక్స్‌లో జోకర్ వచ్చింది.
టాస్క్ ప్రకారం అతను శ్రీముఖిని కలవకుండానే బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లిపోయాడు. అయితే తన తమ్ముడితో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బిగ్ బాస్‌ను ప్రాధేయపడుతూ గట్టిగా ఏడుస్తూ శ్రీముఖి ప్లీజ్ బిగ్ బాస్ ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ భావోద్వేగానికి లోనై కుమిలిపోతోంది శ్రీముఖి. ఈమె ఏడుస్తుంటే బ్యాగ్రౌండ్‌లో మరి దారుణంగా ‘‘కడసారిది వీడ్కోలు.. ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలిచేస్తూ..’’ అనే పాట వస్తుండటంతో ఆడియన్స్‌కి నవ్వాలో లేక శ్రీముఖిని చూసి ఏడ్వాలో తెలియని స్థితిలో ఉండిపోయారు. 

శ్రీముఖి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు. పక్కనే ఉన్న శివజ్యోతి ఎంత స్ట్రాంగ్‌‌గా ఉందో చూడు. ఇంటి పేరు చెప్తేనే కంటి నుండి పాతాళ గంగ పారించే శివజ్యోతి తన భర్తను చూసి ఏడవకుండా ఎలా ఉందో చూడు. ఎమోషనల్, ఏడుపు అని బాబా భాస్కర్ అనడం వల్లో ఏమో తెలియదు కాని ప్రస్తుతానికి మాత్రం శివజ్యోతి ట్యాప్ ఓపెన్ చేయకుండా స్ట్రాంగ్‌గానే ఉంది. ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో నాగార్జున బిగ్ బాస్ సభ్యులని నవ్విస్తాడో లేక పోతే తనదయిన శైలిలో స్వీట్గా వార్నింగ్ ఇస్తాడో వేచి చూడాలి.


    మరింత సమాచారం తెలుసుకోండి: