నటుడు మరియు రాజకీయ నాయకుడైన నరమల్లి శివ ప్రసాద్ గారు నేడు, కాసేపటి క్రితం అనారోగ్యకరణలతో అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. తొలినాళ్లలో డాక్టర్ వృత్తిలో కొనసాగిన శివ ప్రసాద్ గారు ఆ తరువాత సినిమాల మీద మక్కువతో టాలీవుడ్ చిత్ర రంగంలోకి ప్రవేశించి పలు చిత్రాల్లో అక్కడక్కడా కొన్ని చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. అయితే ఆ తరువాత మెల్లగా అవకాశాలు పెరగడం, అలానే కేవలం నటుడిగానే కాక దర్శకుడిగా కూడా తన ప్రతిభను ప్రేక్షకులకు చూపాలనే భావనతో ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించడం జరిగింది. 

ఇక ఆపై రాజీకీయాల్లోకి ప్రవేశించిన శివ ప్రసాద్ గారు, టిడిపి పార్టీలో చేరారు. ఆ తరువాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  1999-2004 ఎన్నికల్లో ఎమ్యెల్యేగా గెలిచిన శివ ప్రసాద్ గారు, 1999-2001 సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖా మంత్రిగా కూడా పలు సేవలందించారు. ఇక ఆ తరువాత 2009లో అలానే 2014లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం తరపున ఎంపికగా ఎన్నికైన శివ ప్రసాద్ గారికి టిడిపి అన్నా, అధినేత చంద్రబాబు అన్నా ఎంతో మక్కువ. ఇక 2014లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లోటిడిపి విజయం సాదించడంతో, ఆ సమయంలో వారితో పొత్తు పెట్టుకున్న కేంద్ర బీజేపీ వారు, ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇస్తాం అని హామీ ఇవ్వడం, 

ఆ తరువాత దానిపై శ్రద్ధ పెట్టకపోవడంతో పార్లమెంట్ ముందు టిడిపి ఎంపీలు ధర్నాలు చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో శివ ప్రసాద్ గారు పలు రకాల వింత వేషాల్లో, హోదా ఇవ్వనందకు నిరసన తెల్పడం జరిగింది. ఆ విధంగా నిత్యం ఒక్కోరకమైన వేషంలో పార్లమెంట్ ముందు అందరితో కలిసి ఆయన నిరసన తెలిపేవారు. అయితే వారందరిలోకి వినూత్నంగా నిరసన తెల్పిన శివ ప్రసాద్ గారిపైనే అప్పటి మీడియా మరియు నాయకుల ప్రత్యేక దృష్టి ఉండేది. అంతేకాక పలు మార్లు మోడీ పై అలానే అప్పటి బీజేపీ నాయకులపై తన మాటల చతురతతో విరుచుకుపడిన శివ ప్రసాద్ గారు, నేడు మన మధ్యన లేరనే వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: