తెలుగులో సినిమాల పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. ఒకప్పుడు కథకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, యూత్ ఆలోచనలకూ తగ్గట్లు ఉండాలని అనుకున్న సినీ జనాలు ఇప్పుడు వారు మెచ్చేవిదంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా చూసుకుంటే వస్తున్నా సినిమాలు అన్ని రొమాంటిక్ కథతో మాత్రమే తెరకెక్కుతున్నాయి. ఒకరు ఏది చేస్తే అదే చేయాలనీ మరింతగా రెచ్చిపోయి మరి సినిమాలను తీస్తున్నారు. 



ఇకపోతే తెలుగులో బాగా ఫెమస్ అయినా రొమాంటిక్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో సెన్సేషనల్ స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. దానితో పెద్ద హీరోల అందరూ అలానే సినిమాలు చేయాలనీ అనుకుంటూ సినిమాలను చేస్తారు. ఆ తరువాత అర్జున్ రెడ్డి ని మించిన సినిమా గా ఆర్ ఎక్స్ 100 సినిమా వచ్చింది. ఆ సినిమాలో నటించిన హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజపుత్.. సినిమాలో ఓ రేంజులో రొమాన్స్ ను పండించారు. యూత్ ఫుల్ సినిమాగా వచ్చిన ఆ సినిమా కూడా బాగా యూత్ కు కనెక్ట్ అయింది.ఇక సినిమా ఓ రేంజులో హిట్ అయింది.



అసలు విషయానికొస్తే.. ఆ సినిమా తర్వాత వాళ్లకు మారె సినిమా కూడా హిట్ అవ్వలేదు. పాయల్ మాత్రం ఓ రేంజులో అందాలను ఆరబోస్తూ వస్తుంది. హీరో కార్తికేయ కు మాత్రం ఒక్క హిట్ సినిమా రాలేదు. మొన్న వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత కార్తికేయ మరో సినిమా చేయబోతున్నాడు. 



ఆ సినిమానే  '90 ఎం ఎల్' .. ఆ సినిమాను తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ సినిమా టైటిల్ కు తగ్గట్లు హీరో కూడా కొత్తగా ఉండబోతున్నాడని ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది.  కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరో ఒక తాగుబోతు పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా అన్న రొమాంటిక్ హీరో కి హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: