నిన్న విడుదలైన గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి థియేటర్ల దగ్గర సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్ మంచి మాస్ ఎలిమెంట్స్ తో వరుణ్ తేజ్ లోని నెగెటివ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ తీసిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను తెగ మురిపించింది. ఇక అథర్వా, పూజా హెగ్డే మరియు మిర్నాలిని రవి అద్భుతమైన పర్ఫామెన్స్ లతోపాటు మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజిలో క్లిక్ అయ్యాయి. ఇకపోతే వరుణ్ తేజ్ సినిమాలో చెప్పినట్టే గట్టర్ లేపి చింపేశాడు.

అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న స్థాయి చర్చకు దారితీసింది. సినిమాలో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ గా రామ్ చరణ్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం ఒకటి ఉంది. మగధీరలోని 'ఓక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు' అనే సీన్ ను వరుణ్ తేజ్ చెప్పాల్సి రాగా దానిని కూడా మన గద్దలకొండ గణేష్ తనదైన శైలిలో చెప్పడం అభిమానులు ఉర్రూతలూగిస్తోంది. అప్పుడు వరుణ్ తేజ్ "నేనేమైనా కాలభైరవ అనుకుంటున్నావా గణేష్… గద్దలకొండ గణేష్" అంటూ బ్రహ్మాజీ కి చెప్తాడు. 

థియేటర్లో చాలా కామెడీగా సాగే ఈ సన్నివేశం అక్కడ మగధీర కాలభైరవ క్యారెక్టర్ కన్నా వాల్మీకి లోని గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా ఉండడం పలువురి దృష్టిని ఆకర్షించింది. అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం వరుణ్ తేజ్, రామ్ చరణ్ డైలాగ్ చెప్పడం విపరీతంగా ఎంజాయ్ చేశారు అనే చెప్పాలి. చాలా ఫన్నీగా చెప్పిన డైలాగ్ రామ్ చరణ్ ని తక్కువ చేసినట్లు ఉందన్నా.... అది కేవలం యాదృచ్ఛికంగా జనాలు నవ్వించడానికి అన్నది మాత్రం స్పష్టం,.


మరింత సమాచారం తెలుసుకోండి: