మాస్ మహారాజ రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్ గా తెరకెక్కిన షాక్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్, తొలి సినిమా పరాజయంతో కొంత నిరాశ పడ్డారు. అయితే అప్పటి పరిస్థితుల ప్రభావం వలన ఆ తరువాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారట హరీష్. ఇక కొంత గ్యాప్ తరువాత మళ్ళి రవితేజ తోనే ఆయన తీసిన మిరపకాయ్ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని, దర్శకుడిగా హరీష్ కు మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దర్శకత్వం వహించే అవకాశాన్ని పట్టేసిన హరీష్, తన కలానికి పదును పెట్టి, పవన్ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని, తన కెరీర్లోనే ఎప్పటికీ గుర్తుండిపోయేలా గబ్బర్ సింగ్ అనే మాస్ సూపర్ హిట్ ని పవన్ కు అందించడం జరిగింది. 

అయితే ఆ తరువాత అదే ఊపులో జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన చేసిన రామయ్య వస్తావయ్యా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని, హరీష్ కి కెరీర్ పరంగా కొంత నెగటివ్ ఇంపాక్ట్ ని తీసుకువచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం అధైర్య పడకుండా, కొంత విరామం తీసుకుని, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మాస్, కమర్షియల్ సినిమాతో మంచి హిట్ కొట్టారు హరీష్. అనంతరం అల్లు అర్జున్ తో ఆయన తీసిన డీజే సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక మరికొంత గ్యాప్ తరువాత, ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఆయన తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 

ఈ సందర్భంగా నిన్న ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హరీష్ మాట్లాడుతూ, తన కట్టె కాలేవరకు తాను పవన్ ఫ్యాన్ నే అని, తనతో కొందరు గబ్బర్ సింగ్ సినిమా ఎంతో అద్భుతంగా తీసావు అని ప్రశంసిస్తున్నపుడు తన మనసుకు ఒకటి అనిపిస్తుంటుందట. అదేమిటంటే, నిజం చెప్పాలంటే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ గారిని కాకుండా వేరొకరిని ఊహించుకోలేమని, అసలు పవన్ కళ్యాణ్ అనే పేరు ముందు గబ్బర్ సింగ్ అనే సినిమా వేస్ట్ అని ఆయన అన్నారు.  మరొక్కసారి తనకు పవన్ ఎప్పుడు అవకాశం ఇస్తారా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానని, తన వద్ద మహేష్, పవన్, చిరులకు సరిపోయే మంచి కథలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో కాలం కలిసి వస్తే వారితో ఆ సినిమాలు తప్పకుండా చేస్తానని అన్నారు హరీష్....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: