మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై  కేరళ అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆయన పై గతంలో ఎర్నాకుళం సమీపంలోని పెరుంభవూర్ కోర్టు అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఈ విషయం మాలీవుడ్‌లో సంచలనంగా మారింది. కాగా 2012కి సంబంధించిన ఈ కేసులో మోహన్ లాల్ ఇంటి నుంచి ఏనుగు దంతపు కళాఖండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఆస్తిని కలిగి ఉండటాన్ని వన్యప్రాణుల రక్షణ చట్టం నిషేధిస్తుంది.

ఈ రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) కింద మోహన్ లాల్ పై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం చార్జిషీట్ సూచిస్తోంది.  ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ ప్రధాన నిందితుడు కూడా కావడం దానికి తోడు ఆయన నేరం కూడా ఒప్పుకున్నాడు.ఇక ఇప్పుడు పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తో పాటు కోదనాడ్ రేం‌లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్‌లో కూడా ఈ కేస్ నమోదైంది.

ప్రభుత్వ సంపదను ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో పెట్టుకున్నారనే నేరంపై దాఖలైన ఈ చార్జ్ షీట్ పై విచారణ జరిగితే.. మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డట్టేనని అంటున్నారు విశ్లేషకులు. అయితే తన పై కేస్ నమోదు అయిన తర్వాత ఏనుగు దంతాల కళాఖండాలను ఇంట్లో ఉంచుకునేందుకు తనకు అనుమతి ఉందంటూ కోర్టుకు తెలిపాడు మోహన్ లాల్. అయితే  తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్‌ చెప్పుకొచ్చాడు.దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని తేల్చేయడం తో ఇప్పుడు ఈ కేసు సూపర్ స్టార్ మెడకు చుట్టుకోనుంది.రాబోయే రోజులు ఈ కేసు ఎన్ని మలుపులు తిరగనుందో అని అంటున్నారు సినీ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: