Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:55 am IST

Menu &Sections

Search

వరుణ్ తేజ్ పై ఆ విమర్శను పోగొట్టిన వాల్మీకి....!

వరుణ్ తేజ్ పై ఆ విమర్శను పోగొట్టిన వాల్మీకి....!
వరుణ్ తేజ్ పై ఆ విమర్శను పోగొట్టిన వాల్మీకి....!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా హీరోల్లో మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్న హీరో వరుణ్ తేజ్. 2014 సంవత్సరంలో ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా వరుణ్ కు నటుడిగా గుర్తింపు వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ నటించిన కంచె సినిమాకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు పెద్దగా రాలేదు. 
 
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. కానీ ఈ సినిమా క్రెడిట్ అంతా హీరోయిన్ సాయిపల్లవి ఖాతాలోకి వెళ్లిపోయింది. 
 
ఫిదా తరువాత వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ సినిమా కూడా హిట్ అయింది. అంతరిక్షం సినిమా ఫ్లాప్ అయినా మంచి ప్రయోగంగా పేరు తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం సంక్రాంతికి వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ సినిమాలో మేజర్ సక్సెస్ క్రెడిట్ వెంకటేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. వరుణ్ తేజ్ కెరీర్లో సోలో క్రెడిట్ తో బ్లాక్ బస్టర్ లేదనే విమర్శ ఉంది. 


నిన్న విడుదలైన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మొదటిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 67 లక్షల రూపాయలు షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొదటిరోజే 25 శాతానికి పైగా రికవరీ కావటంతో ఈ సినిమా నిర్మాతలకు భారీగా లాభాలను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం వరుణ్ తేజ్ క్రేజ్ తో వాల్మీకి బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో వరుణ్ ఖాతాలో సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఈ సినిమా హిట్ తో వరుణ్ తేజ్ పై సోలోగా సక్సెస్ క్రెడిట్ లేదనే విమర్శ కూడా పోయినట్లే అని చెప్పవచ్చు. 
 



varun tej solo block buster valmiki
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డీఎస్పీ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి సుచరిత..!
రైతు భరోసా.... రైతుల్లో నిరాశ...!
కాశ్మీర్ లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కొనసాగుతున్న కాల్పులు...!
కేసీఆర్ కు హైకోర్టు షాక్..?
2 వేల రూపాయల నోటు రద్దు కాబోతుందా...?
చిరంజీవి చిరు కోరిక జగన్ తీరుస్తాడా...?
బాలకృష్ణ తొడగొడితే రైలు వెనక్కి.. ఈ సీన్ వెనుక అసలు మ్యాటర్ ఇది...!
ఏటీఎంకెళ్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
చిరంజీవి జగన్ భేటీ విశేషాలివే..!
మనిషా...? మృగమా..? చికిత్స కోసం వచ్చిన మహిళపై మూడేళ్లుగా లైంగిక దాడి...?
వైయస్సార్ రైతు భరోసా పేరు మార్పు.. భరోసా పెంపు : మంత్రి కన్నబాబు
సీఎం కేసీయార్ మంత్రులపై మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు..!
బిడ్డ శవం పూడ్చటానికి వెళ్లిన తల్లిదండ్రులకు షాక్...?
చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారు : ఎమ్మెల్యే సుధాకర్ బాబు
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం... ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత...!
యూపీలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి పది మంది మృతి...!
మహిళలకు గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర...!
దసరా సెలవుల పొడిగింపు లేదా.. అయోమయంలో తల్లిదండ్రులు..?
కేసీఆర్ కు భారీ షాక్...?
ఆర్ఆర్ఆర్ కథలో మార్పులు... రిలీజ్ డేట్ వాయిదా..?
అల్లు అర్జున్ మహేశ్ బాబులకు కొత్త టెన్షన్...?
చరణ్ కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి...!
వివేకా హత్య కేసులో ఆ వార్తలు నిజమా ? అబద్ధమా..?
కేసీయార్ కు షాక్ ఇస్తున్న టీచర్స్, పేరెంట్స్..!
ఆ విషయంలో కేంద్రం జోక్యం వద్దంటున్న కేసీఆర్ జగన్...?
వీడిన వివేకా హత్య కేసు మిస్టరీ.. ప్రొద్దుటూరు సుఫారీ గ్యాంగ్ చేసినట్లు నిర్ధారణ..!
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే...?
ఏపీలో గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రకటన...?
ప్రభాస్ చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదేనా...?
ఈఎస్ఐ స్కామ్ లో వెలుగు చూస్తున్న వాస్తవాలు..!
ఖమ్మం కలెక్టరేట్ ముందు కార్మికుల నిరసన... ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ పరిస్థితి విషమం.!
హైదరాబాద్ నగరంలో హైటెక్ వ్యభిచారం..!
ఆర్టీసీ కార్మికులతో ఆ ముచ్చటే లేదు అంటున్న కేసీఆర్!
ఒకే మొబైల్ లో రెండు వాట్సాప్ అకౌంట్లు ఉపయోగించాలంటే...?
విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్..!
ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది : కేటీఆర్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.