స్టార్ హీరోయిన్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ ఉంది. కాగా ప్రస్తుతం సినిమా రంగంలో పరిస్థితి చూస్తుంటే చాలా మంది హీరోయిన్లు తమ కంటే చిన్న వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు అదే విధంగా కాజల్ అగర్వాల్ ని పెళ్లి చేసుకోవడానికి సోషల్ మీడియాలో టీనేజ్ కుర్రోడు మరియు అభిమాని ...ఒకరు ప్రేమించాలని ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ ఈ ముద్దుగుమ్మ అభిమాని ప్రపోజల్ కి నో చెప్పటం జరిగింది.


17 వయసు కలిగిన ఆ అభిమాని...నీకు తెలుగు రాకపోయినా పెళ్లి చేసుకుని తెలుగు నేర్పిస్తా అంటూ కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేయడంతో...అది చూసిన కాజల్.. వయసులో తన కన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకోనంటూ ఆ ప్రపోజల్ కి నో చెప్పింది. ఇదే సందర్భంలో మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు అని మరొక ఫాలోవర్ కాజల్ అగర్వాల్ ని ప్రశ్నించగా...సదరు ఫాలోవర్ కి సమాధానంగా.. తనకు వివాహ బంధంపై ఆసక్తి ఉందని.. అన్నీ కుదిరినప్పుడు పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటానని ప్రకటించింది  కాజల్.


ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సౌత్ లో కోలీవుడ్ ఇండస్ట్రీలో కమలహాసన్ - శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సీక్వెల్ సినిమా మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో 'ముంబై సాగా' అనే రెండు సంచలన ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే తాజాగా తన ట్విట్టర్ ఎకౌంట్లో ఫాలోవర్ ల సంఖ్య 3 మిలియన్లు చేరటంతో అభిమానులతో కాసేపు ముచ్చటించడం జరిగింది. దీంతో కాజల్ అగర్వాల్ కి టీనేజ్ కుర్రాడు ప్రపోజ్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: