టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. మంచి యూత్ఫుల్ కంటెంట్ తో పాటు నేటి సమాజంలో ఆడవారిపై జరుగుతున్న లైంగిక వేధింపూల అంశాన్ని తీసుకుని ఎంతో చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు భరత్. కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, క్రిటిక్స్ నుండి ఈ సినిమాకు విపరీతమైన అభినందనలు దక్కడం విశేషం. ఇక ఈ సినిమాతో కెరీర్ పరంగా రెండవసారి హీరో, హీరోయిన్లుగా జోడి కట్టిన విజయ్ మరియు రష్మికలు, 

తమ పాత్రల పరిధిమి మేరకు ఎంతో అద్భుతంగా నటించి, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఈ సినిమాలో విజయ్ ఒక స్టూడెంట్ లీడర్ గా నటించగా, రష్మిక మహిళా క్రికెటర్ పాత్రలో నటించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకు నేడు ఒక అరుదైన గౌరవం దక్కింది. ప్రతియేడు ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డులకు ఈ సినిమా ఎంట్రీ ని దక్కించుకుంది. నేడు ప్రకటించిన విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఇండియా తరపున 28 సినిమాల జాబితా లో డియర్ కామ్రేడ్ ఒకటిగా ఉంది. 

ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) ప్రతినిధులు మన దేశం నుంచి మొత్తం 28 సినిమాల్ని సెలెక్ట్ చేయగా అందులో మన తెలుగు నుండి డియర్ కామ్రేడ్ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా మన పరిశ్రమ నుంచి ఆస్కార్ కు స్థానం సంపాదించడం అటు విజయ్  అభిమానులతో పాటు మన సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఎంతో ఆనందాన్ని నింపింది. అయితే ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ నుండి అంధాధున్, యూరి, బదాయి హో, గల్లీ బోయ్ సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. మరి రాబోయే 2020 ఫిబ్రవరిలో ప్రకటించే ఆస్కార్ అవార్డుల్లో, మన దేశం తరపున ఏ సినిమా ఆ పురస్కారం దక్కించుకుంటుంది అన్నది తెలియాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: