ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు యంగ్ హీరో  టైగర్ ష్రాఫ్ లు మొదటి సారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ "వార్". ఈ సినిమా హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సిద్దార్థ ఆనంద్ వార్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో  గొప్ప డ్యాన్సర్స్ అంటే  హృతిక్ రోషన్, తారక్,రామ్ చరణ్,అల్లు అర్జున్,టైగర్ ష్రాఫ్ లు గుర్తుకు వస్తారు.

వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు  నటించడంతో ఈ సినిమాలో డ్యాన్స్ లపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను  అందుకోవడానికి సినిమా యూనిట్ చాలా కష్టపడి ఒక మంచి డ్యాన్స్ నెంబర్ ను డిజైన్ చేశారు. 2 నిమిషాల నిడివి ఉన్న   జై జై శివ శంకర్   పాటను  హోలి బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశారు. యూట్యూబ్  లో విడుదల చేసిన ఈ పాట కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది.

ఈ పాటలో ఇద్దరు హీరోలు డ్యాన్స్ ఇరగదీసారు. హృతిక్ రోషన్  కాంప్లెక్స్ లెగ్ మూమెంట్స్ తో పాటు  మార్వలెస్ ఎక్స్ ప్రేషన్స్ తో డ్యాన్స్ ఇరగదీసాడు. టైగర్ ష్రాఫ్ జిమ్నాస్టిక్స్  స్టెప్స్ ఎక్కువగా చేశాడు. అయితే టీజర్ లో చూపించింది శాంపిల్ మాత్రమే అంటా. సినిమా లో ఫుల్ సాంగ్ లో ఇంకా చాలా డ్యాన్స్  ఉందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. విశాల్- శేఖర్ లు ఈ పాటకు సంగీతం అందించారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్  టైగర్ ష్రాఫ్ లు  ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేశారు.

ఒక ఫైట్ సీక్వెన్స్ ని ఏడు దేశాల్లో షూట్ చేశారట. ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.  వార్ సినిమా  సైరా కు పోటీగా అక్టోబర్ 2న ప్రపంవ వ్యాప్తంగా విడుదల అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: