ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడైన శివప్రసాద్ గారు నిన్న మధ్యాహ్నం అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి వార్తతో అటు రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా ప్రముఖులు సైతం ఎంతో చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇకపోతే ఆయన మృతిపై వైసిపి నగరి ఎమ్యెల్యే ఆర్ కె రోజా ఎంతో బాధ పడ్డట్లు సమాచారం. ఆయన విషయం తెలియగానే ఆమె ఎంతో కలత చెందారట. ఇక తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ పోస్ట్ చేసి, అందరిని కదిలించారు. ' చిత్తూరు జిల్లా నాయకులు, టిడిపి మాజీ ఎంపీ మరియు నా తోటి నటులు నాకు గురువు సమానులు శివప్రసాద్ గారు అనారోగ్యంతో మరణించడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను' అంటూ ఆమె పోస్ట్ చేయడం జరిగింది. 

అయితే ఆమె శివప్రసాద్ గారి విషయమై అంత భావోద్వేగంతో రోజా గారు ట్వీట్ చేయడానికి ఒక కారణం ఉంది. నిజానికి రోజా గారిని సినిమాల్లోకి తీసుకువచ్చింది శివప్రసాద్ గారే. రోజా అసలు పేరు శ్రీలత, అప్పట్లో శివ ప్రసాద్ గారు తన డైరెక్టరల్ డెబ్యూ వెంచర్ గా తెరకెక్కిద్దాం అనుకున్న ప్రేమ తపస్సు సినిమా కోసం హీరోయిన్ వెతుకులాట మొదలెట్టారట. స్వతహాగా భారతి రాజాగారి ప్రియా శిష్యుడైన శివ ప్రసాద్ గారికి, ఆయన మాదిరిగా తన సినిమాలో కూడా ఎవరైనా కొత్త అమ్మాయినే హీరోయిన్ గా తీసుకోవాలని భావించడం, అదీకాక అప్పట్లో సీమ ప్రాంతం నుండి పెద్దగా హీరోయిన్స్ రాకపోవడంతో, ఆ ప్రాంతంలోనే హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించడం, ఆ తరువాత అనుకోకుండా అక్కడి ఒక నర్సింగ్ ఇంస్టిట్యూట్ కి ఆయన వెళ్లడం, అక్కడి కొందరు నర్సుల మధ్య సూపరింటెండెంట్ గారి అమ్మాయి అయిన రోజా వారి మధ్యన నిలబడి ఉన్న ఫోటోని చూసిన శివప్రసాద్ గారు, 

వెంటనే రోజా గారి ఇంటికి వెళ్లి, ఆమె తల్లితద్రులతో మాట్లాడి తన సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. అయితే ఆమెను హీరోయిన్ గా తీసేయాలని తన యూనిట్ సభ్యులు కొందరు ఆయన పై ఒత్తిడి తెచ్చినప్పటికీ అవేవి పట్టించుకోకుండా, చివరికి సినిమా తీసి రోజాని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అంతేకాక ఆమె తప్పకుండా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు వెళ్తుందని అప్పట్లోనే ఆయన చెప్పకనే చెప్పారట. ఆ తరువాత ఆమె 120 సినిమాల్లో హీరోయిన్ గా నటించడం, అలానే శివప్రసాద్ గారి ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో ప్రవేశించి, ప్రస్తుతం వైసిపి తరపున ఎమ్యెల్యేగా గెలవడం వరకు ఆమె ప్రస్థానం కొనసాగడానికి ఆ విధంగా శివ ప్రసాద్ గారు పునాది వేసారు. అందుకే రోజా గారు ఆయనను తండ్రి వలె ఎంతో అభిమానిస్తారట. ఇక రేపటి ఆయన అంత్యక్రియలకు కూడా రోజా గారు హాజరు కానున్నట్లు సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: