తెలుగు సినీ చరిత్రలో సువర్ణ అధ్యాయాలతో లిఖించే చిత్రాలు ఎన్నో వచ్చాయి. వస్తున్నాయి. రాబోతాయి కూడా. ప్రతీ కధ వెనక ఓ నేపధ్యం ఉంటుంది. బలమైన నేపధ్యం ఉంటేనే సినిమా విజయానికి అది కారణం అవుతుంది. వందల కోట్లు పెట్టి ఈ మధ్య తీసిన ఓ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడం కళ్ళారా చూశారంతా. అందులో అతి ముఖ్యమైనది కధ లేకపోవడం.


ఇక విషయానికి వస్తే కొందరి నాయకుల జీవితాల మీద కధలు తీయాలనుకున్నపుడు వారి కుటుంబ సభ్యుల అనుమతి అవసరం. అందులోనూ తొలి స్వాతంత్ర్ర  సమరయోధుడు  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తీయాలనుకున్నప్పుడు వారి కుటుంబీకులను కలసి ఆమోదం పొందాలని అంటున్నారు. అయితే సైరా విషయంలో ఈ రకమైన ఆమోదం లభించిందని అందుకే సినిమా తీశారని చెబుతారు.


అయితే కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ఉందనగా సైరా సినిమా విషయంలో ఒప్పందాన్ని కాలదన్ని తమను మోసం  చేశారంటూ ఉయ్యాలవాడ కుటుంబీకులు రోడ్డెక్కడం విశేషం. వారు చిత్ర కధానాయకుడు చిరంజీవి ఇంటికి వెళ్ళి మరీ ఆందోళన  చేయడంతో జూబ్లీ  హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరో వైపు తమ కుటుంబాన్ని చిత్ర నిర్మాత రాం చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి మోసం చేశారని ఉయ్యాలవాడ కుటుంబీకులు  జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.


తాము ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన 23 మంది ఉన్నామని, తమ ఆస్తులు, ప్రాంతాలు, కధను తీసుకుని 50 కోట్లు ఇస్తామని చెప్పి చిత్ర యూనిట్ మోసం చేసిందని వారు ఫిర్యాదు  చేశారు. మరి ఈ వివాదం ఎంతవరకూ పోతుందో చూడాలి.  ఈ సినిమా విషయంలో ఓ వైపు ప్రమోషన్ జోరుగా సాగుతుంటే వివాదమూ అలాగే చెలరేగుతోంది మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: