ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటించిన "కబీర్ సింగ్" సినిమా ఘనవిజయం సాధించింది. కబీర్ సింగ్ సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాకి  అఫిషియల్ రీమేక్. అందాల తార కైరా అద్వాని  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. కబీర్ సింగ్ సినిమా దాదాపు 270 కోట్ల వసూళ్లు సాధించి 2019 లోనే టాప్ బాలీవుడ్ సినిమా గా నిలిచింది.

కబీర్ సింగ్ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే విమర్శలు కూడా ఎక్కువగా వచ్చాయి.షాహిద్ కపూర్ తాజా గా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన 16 సంవత్సరాల సినీ జీవితంలోని పలు ఆసక్తికరమై విషయాలు వెల్లడించారు. 2019 నాకు చాలా స్పెషల్ ఇయర్.  కబీర్ సింగ్ సినిమా మాత్రం నా 16 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం. నాకు మిగతా హీరోల కంటే అదృష్టం తక్కువగా ఉంది అనుకోను. నా తోటి హీరోలు సక్సెస్ అవ్వడానికి కారణం వారు కష్టపడ్డారు.వాళ్ళు సరియైన నిర్ణయాలు తీసుకున్నారు.వారికి అదృష్టం బాగుంది మరియు మంచి అవకాశాలు వచ్చాయి. కొన్ని సార్లు మనకు మంచి  రోజులు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అని అన్నారు.

కబీర్ సింగ్ సినిమా కొంచెం డార్క్ గా ఉంది. కొంత మందికి ఈ సినిమా నచ్చదు కాబట్టి  విమర్శలు వస్తాయని ఊహించాం. దర్శకుడు సందీప్ రెడ్డి  గురించి మాట్లాడుతూ ఆయనే  ఒరిజినల్ కబీర్ సింగ్ అని అన్నాడు . నాకు నా భార్య మీరా అర్జున్ రెడ్డి సినిమా లో నటించమని చెప్పింది. ఆమె కు ఈ సినిమా చాలా బాగా నచ్చింది.షాహిద్ కపూర్ రీసెంట్ గా 55 కోట్ల తో ఖరీదైన బంగ్లా కోన్నాడు. షాహిద్ సోలో హీరోగా నటించి 100 కోట్లు రాబట్టిన మొదటి చిత్రం కబీర్ సింగ్. షాహిద్ కపూర్ జెర్సీ రీమేక్ లో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి . అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి: