శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులకు  ఊహించని షాక్ ఇచ్చాడు.  రాహుల్ ఎలిమినేట్ అవ్వడం విచిత్రంగా అనిపించింది. అయితే చాలా మంది ఇది ఫేక్ ఎలిమినేషన్ అని ముందుగానే గుర్తించారు. అందుకు తగ్గట్లుగానే నాగార్జున గారు ఇది ఫేక్ ఎలిమినేషన్ అని తేల్చేశారు. అయితే రాహుల్ ని  ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనేది మాత్రం సందేహంగా ఉంది. రాహుల్ ని అలా చేయడం వెనక మూడు కారణాలున్నాయని తెలుస్తుంది.


గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ లో బిగ్ బాస్ లో ఇంటెన్సిటీ చాలా తగ్గింది. కంటెస్టెంట్స్ ఇంకా ముసుగు వేసుకునే గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ ముసుగు తీసేసి, ఇంటెన్సిటీని పెంచాల్సిన అవసరం ఉందని బిగ్ బాస్ గుర్తించాడు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని గుర్తించిన బిగ్ బాస్ ఆ గేమ్ ని డిస్ట్రబ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశాడని అంటున్నారు.రాహుల్ మిత్రబృందం అయిన నలుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తే వారి ఆట తీరులో ఏమైనా మార్పు వస్తుందని అనుకుని ఉంటాడు.


ఇప్పటి వరకు ఆ గ్రూపులోని మెంబర్స్ నామినేషన్ లోకి వెళ్తున్నప్పటికీ సేవ్ అవుతూ వస్తున్నారు. అందుకని వారి మధ్య దూరం పెంచితే, అది ఆట మీద ప్రభావాన్ని చూపిస్తుందని బిగ్ బాస్ భావించి ఉంటాడు. అంతేగాక గత వారంలో అందరినీ ఆకట్టుకున్న పునర్నవి, రాహుల్ నామినేషన్ ప్రక్రియని ఈ విధంగా వాడుకున్నాడని అర్థం అవుతుంది. రాహుల్ పునర్నవి కోసం త్యాగం చేసాడు. కానీ పునర్నవి త్యాగం చేస్తానంటే రాహుల్ వద్దని చెప్పాడు. 


ఒకవేళ రాహుల్ ఎలిమినేట్ అయితే పునర్నవి గిల్టీగా ఫీల్ అవుతుందని ముందే చెప్పింది. ఆ గిల్ట్ ఫీలింగ్ ఆమెకి కలుగజేస్తే ఆటలో మరింత మజా వస్తుంది. అంతేకాక సజావుగా సాగుతున్న బిగ్ బాస్ లో ఒక ట్విస్ట్ ఉండాలనే ఉద్దేశ్యంతో కూడా ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తుంది.  ఇంటి సభ్యులందరూ ఇంకా ముసుగులు వేసుకుని గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసినట్టు చెప్తే, వాళ్లలో ఏమైనా మార్పు వస్తుందని భావించి ఉంటాడు. మరి బిగ్ బాస్ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: