టాలీవుడ్ లో మెగా హీరోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిఫరెంట్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  డ్యాన్స్, ఫైట్స్ లో బన్నీ రూటే సపరేట్.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని దేశభక్తి నేపథ్యంలో వక్కంతం వంశి దర్శకత్వంలో ‘నాపేరు సూర్య’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది.  అయితే ఈ మూవీలో బన్ని లుక్..అగ్రెసీవ్ యాక్షన్ తో దుమ్మురేపాడు.  కానీ ఈ మూవీ లో అల్లు అర్జున్ బార్డర్ లో సైనికుడిగా ఉండాలనే తాపత్రయం..ఆయన తండ్రి యాక్షన్ హీరో అర్జున్ తో ఒక సంతంకం కోసం ఎన్ని బాధలు పడ్డాడు..చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నదే సినిమా కథ. 

బన్నీ యాక్షన్ కి వంద మార్కులు పడ్డా..ఈ మూవీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది.  ఈ మూవీ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపుములో’ మూవీలో నటిస్తున్నాడు.   ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలబడబోతుందని చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. త్వరలో ప్యారిస్ లో పాటల చిత్రీకరణకు సిద్ధమవుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.   తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో బన్నీ ఓ మూవీలో నటించబోతున్నారని..అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.  ప్రస్తుతం మురుగదాస్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్భార్’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే మురుగదాస్ తో బన్నీ సినిమా వార్తలో నిజం లేదనేది తాజా సమాచారం. ముందుగా చెప్పినట్టుగానే త్రివిక్రమ్ తరువాత వేణు శ్రీరామ్, సుకుమార్ లతో బన్నీ సినిమాలు వుంటాయని అంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ 'దర్బార్' సినిమా పనులతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: