చలో మూవీతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. కేవలం తెలుగే కాదు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ నటిగా మంచి పేరును సొంతం చేసుకుంది. వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నా ఈ బ్యూటీ మరో అద్భుతమైన పాత్రలో కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ సరసం నటించిన ఈ బ్యూటీకి ఆ సినిమాలు రెండు హిట్ టాక్ ను అందించాయి. 


వివరాల్లోకి వెళితే.. రంగస్థలం సినిమాతో మాంచి పాపులారిటీని సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్. ఆ సినిమాను బాహుబలి రేంజులో హిట్ అయ్యేలా చేసాడు. ఆ సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలు బాగా పాకులారిటీని సంపాదించుకున్నాయి. సమంత నటన ఈ సినిమాలో హైలెట్ అని చెప్పాలి. ఆమె కట్టు, బొట్టు అణుకువ అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయి. 


ఆ సినిమాతో సామ్ స్థాయి కూడా పెరిగింది. ఇకపోతే ప్రస్తుతం బన్నీతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో అంతకు మించిన పాత్రను సిద్ధం చేస్తున్నాడు. ఆసినిమా పల్లెటూరు కథగా సాగుతుండటంతో, ఆ క్యారెక్టర్లో ఇమిడి పోయేలాగా హీరోయిన్ పెర్ఫామెన్స్ కూడా ఉండాలని అనుకున్న సుక్కు హీరోయిన్ వేటలో పడ్డాడు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న నటించబోతుంది. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్న సుక్కు రశ్మికను కూడా ఒప్పించేసాడు. 


పల్లెటూరు అమ్మాయి పాత్రలో సమంత సెట్ అయినంతగా రష్మిక సెట్ అయ్యేనా చూడాలి. దర్శకుడు ఎవరినైనా పాత్రలో లీనం చేయగలడు.అంతకు మించిన పాత్రలో రశ్మికను చూపించబోతున్నారు సుక్కు.. ఈమె మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా తరువాత సుక్కు, బన్నీ సినిమాలో నటించబోతుంది.. బన్నీ స్పీడ్ ను ఎలా తట్టుకుంటుందో చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: