మాములుగా సినిమా అంటే పూజ కార్యక్రమాలు మొదలైనప్పటి నుండి ఎండ్ అయ్యేవరకు ఆ సినిమా హంగామా మాములుగా ఉండదు. చిన్న హీరో అయిన, పెద్ద హీరో అయిన కూడా సినిమా మొదలైనప్పటి నుండే పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతూ ఉంటారు సినీ దర్శక నిర్మాతలు. అభిమానుల హంగామాతో, థియేటర్ల హడావుడితో సందడి చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఆనవాయితీనే అది. 


ఓ స్టార్ నటించిన తాజా చిత్రం ఎటువంటి హడావిడి లేకుండా విడుదలకు సిద్ధం కానుంది. ఇంతకీ ఎవరా ఆ హీరో, ఏ సినిమా అది ఇప్పుడు చూద్దాము.ఇటు తెలుగు, అటు తమిళంలో నటిస్తూ వరుస విజయాలందుకుంటున్న హీరో తమిళ్ స్టార్ హీరో సూర్య. అయన సినిమాలు ఏవి వచ్చిన కూడా చాలా హడావుడితో రిలీజ్ అవుతాయి. నిన్న వచ్చిన అయన సినిమా బందోబస్తు. 


ఆ సినిమా విషయానికొస్తే.. హిట్ అయిందనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా తర్వాత సూర్య ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమా ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పూర్తయింది అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే రిలీజ్ అయింది. 'కాప్పాన్‌'  అనే సినిమా మొన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ఏ హాడావిడీ లేదు దానికి కారణం లేకపోలేదు.. సూర్య కోరిక మేరకు ఆ చిత్ర యూనిట్ అలా ఫ్లాన్ చేసిందట. 


మొన్న మధ్య  ఓ రాజకీయ పార్టికి చెందిన నాయకుడు ఒకరు పెట్టిన ఫ్లెక్సీ కారణంగా టూవిలర్‌లో ప్రయాణిస్తు అటు వైపుగా వెళుతున్న ఓ సాఫ్ట్‌ వేర్‌ మహిళా ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో కొందరు సినీ రాజకీయ ప్రముఖులు ఇంకా ఎటువంటి కటౌట్లు పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అందులో సూర్యా కూడా ఒకరు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: