జయం రవి , కాజల్ జంటగా నటించిన లేటెస్ట్  కోలీవుడ్ మూవీ  కోమలి.   ఇటీవల విడుదలైన ఈచిత్రం  సూపర్ హిట్ టాక్ తో 50కోట్ల గ్రాస్ వసూళ్లను  రాబట్టి ఈ ఏడాది  కోలీవుడ్ లో  అతి పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టు  సినిమాల్లో ఒకటి గా నిలిచింది. కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ప్రశాంత్ రంగరాజన్  తెరకెక్కించిన ఈ చిత్రంలో యోగి బాబు , కె ఎస్ రవికుమార్ ముఖ్య పాత్రల్లో నటించగా   హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.  ఈ చిత్రాన్ని వేల్స్  ఫిలిం ఇంటర్ నేషనల్స్  నిర్మించింది.   



ఇక ఈ చిత్రం యొక్క అన్ని భాషల రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత  బోనీ కపూర్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా హిందీలో ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు  అర్జున్ కపూర్  తో రీమేక్ చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం  అర్జున్ కపూర్ 'పానిపట్' అనే చరిత్రాత్మక  చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని  పూర్తి చేసి  అర్జున్ .. కోమలి రీమేక్ ను స్టార్ట్ చేయనున్నాడు.  ఈ చిత్రానికి డైరెక్టర్ ను అలాగే ఇతర నటీనటులను , సాంకేతిక నిపుణలను ఎంపిక చేయాల్సివుంది.



ఇదిలా ఉంటే  బోనీ కపూర్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఇప్పటికే  కోలీవుడ్ లోకి ఇటీవల అజిత్ నటించిన  నెర్కొండ పరవాయి  తోనిర్మాత గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు బోనీ కపూర్.  ఈచిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఇప్పుడు కోమలి రీమేక్ తో టాలీవుడ్ లోకి  అడగుపెట్టి బోణీ కొట్టాలని  బోనీ కపూర్  ప్లాన్ చేస్తున్నాడు.  మరి కోమలి తెలుగు రీమేక్ లో ఏ  హీరో నటిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: