సామాజిక స్పృహ సినిమాలకు చిరునామాగా ఉండే గోపీ చంద్ ఒకనాటి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. ‘సైరా’ మ్యానియాను లెక్క చేయకుండా వచ్చేనెల అక్టోబర్ 5న విడుదల కాబోతున్న తన లేటెస్ట్ మూవీ ‘చాణక్య’ ను ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తో తన సాన్నిహిత్యం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ప్రభాస్ సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచి తనకు సన్నిహితుడు అని చెపుతూ తామిద్దరం ఏ విషయం అయినా ఎటువంటి మొహమాటం లేకుండా మొఖం మీదే మాట్లాడుకుంటామని చెపుతూ తమ మధ్య ఇగోలు లేవు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ప్రభాస్ ఖాళీగా ఉన్నప్పుడల్లా తనను తన ఇంటికి పిలుస్తూ ఉంటాడనీ గంటల కొద్ది మాట్లాడుకునే తమ మధ్య ఎటువంటి సినిమా విషయాలు చర్చకు రావు అన్న విషయాన్ని లీక్ చేసాడు.

ప్రభాస్ తనతో ఎక్కువగా సామాజిక విషయాల గురించి మాట్లాదతాడని అలా మాట్లాడుతున్న అతడికి అన్ని విషయాలు తెలుసా అన్న ఆశ్చర్యం తనకు కలుగుతుంది అన్న కామెంట్ చేసాడు. ప్రభాస్ తో ఒక మల్టీ స్టారర్ చేసే ఉద్దేశ్యం తనకు ఉంది అని లీకులు ఇస్తూ కథను బట్టి ఆ మూవీలో తాను నెగిటివ్ పాత్రను చేసినా ఆశ్చర్యం లడు అని అంటున్నాడు. 

ఇదే సందర్భంలో ప్రభాస్ గురించి మరొక ఆసక్తికర విషయం షేర్ చేసాడు. అతడు నేషనల్ స్టార్ ఇమేజ్ లోకి వెళ్లిపోయినా ఎటువంటి గర్వాన్ని చూపెట్టకుండా తనతో అన్ని విషయాలు షేర్ చేసుకునే ప్రభాస్ ను చూస్తే తనకు చాల గర్వంగా ఉంటుంది అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతరం దర్శకుల గురించి మాట్లాడుతూ సమాజాన్ని అతి దగ్గరగా చూసి వాస్తవిక సినిమాలను తీసిన తన తండ్రి టి. కృష్ణ దాసరి లాంటి వ్యక్తులు ఇప్పుడు లేరనీ కొంత వరకు  తమిళ దర్శకుడు శంకర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ తన అభిప్రాయాలను వెళ్ళడించాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: