కమలహాసన్ కూతురుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండాలి అంటూ నిరంతరం శ్రమించే శృతిహాసన్ తెలుగులో ‘కాటమరాయుడు’ చాల గ్యాప్ తీసుకుని ఈ మధ్యనే లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమాకు సైన్ చేసింది. అమెరికాలోని ఒక ప్రముఖ ఛానల్ వచ్చే నెల నుండి ప్రసారం చేయబోతున్న టీవీ సిరీస్ ‘ట్రేడ్ స్టోన్’ కోసం నెలలు తరబడి శ్రమించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. 

శృతి హాసన్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. తనకు సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి అని చెపుతూ తనకు 80 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత సినిమాలలో ఎవరైనా అవకాశం ఇస్తే నటిస్తానని చెపుతూ ప్రస్తుతం తాను తన ఏకాగ్రత పెంచుకోవడం కోసం బంతి మీద ఒక కాలు పెట్టి మరొక కాలు గాలిలోకి లేపుతూ బ్యాలెన్స్ చేసే పని మీద తాను బిజీగా ఉన్నాను అని చెపుతూ ఒక షాకింగ్ సీక్రెట్ బయట పెట్టింది. 

లైఫ్ లో ఎవరికీ ఏది అనుకున్నట్లు జరగదనీ జీవితం మనల్ని ఎక్కడకు తీసుకు వెళితే అక్కడకు వెళ్ళాలి కానీ జీవితాన్ని మనం డ్రైవ్ చేయాలని ప్రయత్నిస్తే మనకు ఎంత సమర్ధత ఉన్నా జీవితం మనకు లొంగదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో తన తండ్రి కమలహాసన్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తన తండ్రికి ఎన్ని ఆస్థులు ఉన్నాయో తనకు తెలియవనీ కనీసం ఆ విషయాల గురించి తను మాట్లాడననీ అంటూ కామెంట్ చేసింది. తన తండ్రి తనను తన చెల్లెలునీ చాల మంచి స్కూల్స్ లో చదివిస్తూ ఆ తరువాత అమెరికాలోని బెస్ట్ కాలేజీలలో తమకు చదువులు చెప్పించాడని చెపుతూ తనకు 21 ఏళ్ళు వచ్చిన తరువాత తన తండ్రిని ఒక్క రూపాయి కూడ అడగలేదు అంటూ తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. అయితే తన తండ్రి 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో తాను తన తండ్రికి ఒక ఊహించని గిఫ్ట్ ఇచ్చాను అంటూ ఆగిఫ్ట్ మాత్రం తాను బయటకు చెప్పను అని అంటోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: