Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:44 pm IST

Menu &Sections

Search

పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌

పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌
పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం కాదంబరి పుట్టినరోజు కూడా. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు అలీ, ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ నటులు ఫృథ్వీ, దర్శకులు అజయ్ కుమార్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, కృష్ణ మోహన్ రెడ్డి, యువ నేత కార్తీక రెడ్డి సహా పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు, మనం సైతం సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు ప్రజలు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 


         ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...సేవ చేసే మనసున్న వారే నా దృష్టిలో గొప్పవారు. సాటివారికి సాయం చేసేవారికి పాదాభివందనం చేస్తా. పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తా. ఆర్థిక ఇబ్బందులతో తమకు అనారోగ్యం ఉందని చెప్పుకోలేక తమలోనే దాచుకుని ఆ వ్యాధితో చనిపోయిన వారిని నేను చూశాను. పేదవారికి జనతా హాస్పిటల్, వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఒకే ప్రాంగణంలో నిర్మించాలనేది నా జీవితకాల కోరిక. నేను పుట్టినరోజులు జరుపుకోవడం త్యజించాను. మనం సైతం పుట్టినరోజే నాకు ముఖ్యం. నేనున్నా లేకున్నా మనం సైతం ఉంటుంది. నా మిత్రులు అలీ, ఫృథ్వీ మనం సైతం బిడ్డను ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. అన్నారు.


         నటులు ఫృథ్వీ మాట్లాడుతూ..టీవీ నటుడిగా, పాత్రికేయుడిగా ఉన్నప్పటి నుంచి కాదంబరి నాకు తెలుసు. మంచి మిత్రుడు. ఇక్కడ మన ప్రతిభను గుర్తించి పిలవాలి గానీ మనం ఎవరినీ ఏమీ అడగకూడదు అంటూ నా కెరీర్ ప్రారంభంలో మంచి మాటలు చెప్పారు. నేను ఎన్నో సేవా సంస్థలు చూశాను. కానీ నా దృష్టిలో ఇంతమంచి కార్యక్రమాలు చేస్తున్న మనం సైతమే నెంబర్ వన్ సేవా సంస్థ. ఈ సంస్థకు నేను వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేస్తాను, నాకు తెలిసిన పెద్దలతో మాట్లాడి సహాయం ఇప్పిస్తాను. ఇది నేను చిత్ర పరిశ్రమలో ఒక కుటుంబ సభ్యుడిగా చేస్తున్న బాధ్యత అనుకుంటాను. అన్నారు.


        నటులు అలీ మాట్లాడుతూ..అందరు ఆస్తులు సంపాదించుకుంటారు, కాదంబరి పదిమంది దీవెనలు సంపాదించుకుంటున్నాడు. ఆయన పెద్ద జమీందారీ కుటుంబం నుంచి రాలేదు. మధ్య తరగతి వ్యక్తి తను. అయినా ఒక్కడిగా ఎదుగుతూ పైకొచ్చారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ వ్యాఖ్యాతగా మీ అభిమానం పొందాడు. సాటి మనిషికి సాయం చేస్తే దేవుడు మరింత తిరిగి ఇస్తాడు అనేది అన్ని మతాలు చెప్పే నీతి. కాదంబరి ఈ సేవా మార్గాన్ని అనుసరిస్తున్నాడు. అనేక మందికి తను సాయపడటం చూశాను. నా వంతు సాయం తప్పకుండా ప్రకటిస్తా అన్నారు.
       కార్తీకరెడ్డి మాట్లాడుతూ...నేను సైతం..అంటూ మహాకవి శ్రీశ్రీ సమాజహితంలో భాగమవుతా అంటూ రాసిన మాటల్ని కాదంబరి మనం సైతం అంటూ నిజం చేస్తున్నాడు. అన్నారు.


pedodiki anyayam cheste devudinaina eduristaanantunna kaadambarikiran
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రెండు రెట్లు ఎక్కువ చూపిస్తానంటున్న మారుతి
కాంబినేషన్ కొత్తగా ఉందంటున్న మ‌హేష్‌
'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?
హాలీవుడ్ స్ధాయికి రౌడీ హీరో క్రేజ్‌.... జోష్‌ మాములుగా లేదుగా...!
క్రేజీ హీరోకి సూప‌ర్‌స్టార్ స‌పోర్ట్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో...?
త‌మ్ముడు స‌క్సెస్ అయితే నేను డ్ర‌స్ మారుస్తా...?
ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న మంజు
వ‌ర్మ `బ్యూటిఫుల్‌` ఘాటు మాములుగాలేదుగా...?
ఉత్తేజ్ స్కూల్‌కి డిమాండ్ బాగానే ఉందే...?
సాయి పల్లవి 'అనుకోని అతిథి'
హీరో వెంక‌టేష్ నాకు ఇన్స్‌పిరేష‌న్‌
డైరెక్ట‌ర్లను అంత మాట అనేశాడేంటి
వి.వి. వినాయ‌క్ కి చోటాకె.నాయుడంటే భ‌య‌మా...?
రాజ‌మౌళి ఈగ తో పోటీ ప‌డుతున్న చీమ
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
జ‌న‌నేత జ‌గ‌న‌న్న‌ "ఆటో రజని"కి బ్లెస్సింగ్సా
మా అబ్బాయి క‌ల‌ను నేను నెర‌వేర్చా-చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర‌రావు
రాగల 24 గంటల్లో ఈషా రెబ్బా ఏం చేయ‌బోతుందంటే...!
వనవాసం లో ఏం జ‌ర‌గ‌బోతుంది...?
నవంబర్ 8న మీసం తిప్ప‌నున్న శ్రీ‌విష్ణు
అమెరికాలో బెల్లంకొండ గణేశ్ షూటింగ్
అల‌వైకుంఠ‌పురంలో ఆ సీన్ల‌కి పెద్ద‌పీట‌!
ఘనంగా ద‌ర్శ‌కుడు బాబీ కుమార్తె వైషు పుట్టినరోజు వేడుక
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.