Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 10:30 pm IST

Menu &Sections

Search

బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?

బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?
బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్ పై "త్రీ మంకీస్" చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి.దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్కును జరుపుకుంటుంది. ఈ చిత్రం లోగో, మరియు ఫస్ట్ లుక్ లాంచ్ విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 22న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి మెగాబ్రదర్ నాగబాబు, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసి త్రీ మంకీస్ లోగో, చిత్ర ఫస్ట్ లుక్ సంయుక్తంగా లాంచ్ చేసారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, దర్శకుడు అనిల్ కుమార్, నిర్మాత నగేష్, కెమెరామెన్ సన్నీ దోమల పాల్గొన్నారు.


ఆ ముగ్గురి కామిడీ చూస్తే ఒక ఎనర్జీ వస్తుంది!!
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈ ముగ్గురూ వేరు వేరు వ్యక్తులైనా .. కానీ ముగ్గురు ఒక్కటే. ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అలా వీళ్ళ ముగ్గురు కామిడీ  ఉంటుంది. నా ఐపాడ్ లో ఎప్పుడు వీళ్లు చేసిన స్కిట్స్ వంద ఉంటాయి. టెంక్షన్ లో వున్నప్పుడు, ట్రాఫిక్ లో వున్నప్పుడు వెంటనే ఇపాడ్లో వున్న స్కిట్స్ చూస్తాను. ఒక ఎనర్జీ వస్తుంది.  వెంటనే రిలాక్స్ అయిపోతాను. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇంటికి ఎప్పుడొచ్చామా కూడా తెలీదు. అంత హ్యాపీగా వాళ్ళ స్కిట్స్ ఉంటాయి. వాళ్ళ కామిడీని బాగా ఎంజాయ్ చేస్తాను. సుధీర్, శ్రీను, రాంప్రసాద్ కలిసి నటించిన "త్రీ మంకీస్" చిత్రం భళారే విచిత్రం, అహనా పెళ్ళంట, ప్రేమకథాచిత్రం అంత పెద్దహిట్ కావాలి.. అన్నారు.


నాకు బాగా ఇష్టమైన టీమ్ అదే!!
మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ఈ సినిమా రిస్క్ అని కాకుండా జబర్దస్ట్ టీమ్ సుధీర్, శ్రీను, రాంప్రసాద్ లపై ఫోకస్ పెట్టి ఈ "త్రీ మంకీస్" మూవీని నిర్మించిన దర్శక,నిర్మాతలకు నా అభినందనలు. వాళ్లతో సినిమా తీసి వారు చాలా తెలివిగల పని చేసారు. ఎందుకంటే జబర్దస్ట్ లో సుధీర్ వాళ్ళ టీమ్ అంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళ స్కిట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. అందరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అసలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి లేకపోతే జబర్దస్ట్ అనేది లేదు. అతను ఓ క్రియేటర్. మా అందరికీ ఒక స్టేజ్ కల్పించి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడు సీరియస్ మూడ్లో వుంటారు. కానీ అలాంటి వ్యక్తి జబర్దస్ట్ కామిడీ షో చేయడం విచిత్రంగా అనిపించింది. నాకు రోజాకి జడ్జెస్ గా మంచి పేరు వచ్చిందంటే శ్యామ్ ప్రసాద్ వల్లే. జబర్దస్ట్ షో తెలుగు ఇండస్ట్రీకి ర మెటీరియల్ కమెడియన్స్ సప్లై చేస్తుంది. అందరూ ఒక పొటెన్షియాలిటీ వున్న కమెడియన్స్. సుధీర్ కామిడీ టైమింగ్, రాంప్రసాద్ పంచ్ డైలాగ్స్ ముఖ్యంగా గెటప్ శ్రీను నటన అంటే నాకు ఇష్టం. నేను ఎక్కువగా అభిమానించే ఆల్ టైం కమిడియన్ గెటప్ శ్రీను. అతను ఇంటర్నేషనల్ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయగల గొప్ప నటుడు. 90 రకాల గెటప్ లు వివిధమైన బాడీ లాంగ్వేజెస్ లో తన కామెడీతో అలరించాడు శ్రీను. నాకు కామిడీ చూడటం అంటే ఇష్టం. అన్నిభాష చిత్రాలు కామిడీ చూస్తాను. ఆ అనుభవంతో చెపుతున్నాను. గెటప్ శ్రీను అద్భుతమైన గొప్ప  ఆర్టిస్ట్. ఇలాంటి నటుల్ని తెలుగు ఇండస్ట్రీ ఉపయోగించుకోకపోతే ఒక ఆణిముత్యాన్ని, ఒక వజ్రాన్ని మిస్ చేసుకున్న వాళ్లమవుతాం. ఈ సినిమాతో అందరికీ మంచిపేరు రావాలని కోరుకుంటున్నాను. . . అన్నారు.


హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. సెట్లో మేమంతా బాగా ఎంజాయ్ చేస్తూ.. చేశాం. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాని చూసి సక్సెస్ చెయ్యాలని.. అన్నారు.


గెటప్ శ్రీను మాట్లాడుతూ.. జబర్దస్ట్ షో ద్వారా మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించారు. అక్కడనుండి  వెనక్కిచూసుకోకుండా ముందుకు వెళ్తున్నాం. ఎంటర్టైన్మెంట్ ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకులు అనిల్. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు.. అన్నారు.


రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు బుల్లితెరపై నవ్వులు పూయించామ్. ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్ పై కలిసి అలరించడానికి వస్తున్నాం.ఆడియెన్స్ అందరినీ  పక్కాగా నవ్విస్తాం.. అన్నారు.


సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ఈ సినిమా మేము చేయడానికి అవినాష్ కారణం. స్క్రిప్ట్ వినగానే బాగా నచ్చింది. చెప్పింది చెప్పినట్లు తీశారు. కారుణ్య హీరోయిన్ గా మెయిన్ పాత్రలో నటించింది. ఆమె చుట్టూ కథ అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అంతా నవ్విస్తాం. సెకండాఫ్లో అందరిని ఏడిపిస్తామ్...అన్నారు.


దర్శకుడు అనిల్ కుమార్ జి మాట్లాడుతూ.. జబర్దస్ట్ షో ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేసిన సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను నవ్వించడానికి త్రీ మంకీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్కిప్ట్ ని నమ్మి ఈ సినిమా ఛేశామ్. నవ్విస్తూ.. అందర్నీ ఏడిపిస్తారు.. అన్నారు.


నిర్మాత నగేష్ జి. మాట్లాడుతూ.. డైరెక్టర్ అనిల్ నా క్లాస్ మేట్. మాది వరంగల్. ఈ సినిమా స్టోరీ చర్చలు అన్నీ అక్కడే జరిగాయి. స్క్రిప్ట్ వినగానే సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను అయితే బాగుంటుందని గట్టిగా పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాము. చాలా నాచురల్ గా షూటింగ్ చేశాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు.bullitera comedianlu herolavvagaraa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇస్మార్ట్ భామ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాద్షాతో క‌లిసి చిందులేసిందా...?
ఎర్ర‌చీర‌లో శ్రీ‌కాంత్ అఘోరా...?
కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌ లో ఏం దొరుకుద్దో...?
ఇక్కట్ల‌లో ప్రజలు
జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే ఇవి తినాల్సిందే...!
రాత్రిపూట మ‌నం చేసే త‌ప్పులే మ‌న‌కు శాపాలా...?
రెండు రెట్లు ఎక్కువ చూపిస్తానంటున్న మారుతి
కాంబినేషన్ కొత్తగా ఉందంటున్న మ‌హేష్‌
'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?
హాలీవుడ్ స్ధాయికి రౌడీ హీరో క్రేజ్‌.... జోష్‌ మాములుగా లేదుగా...!
క్రేజీ హీరోకి సూప‌ర్‌స్టార్ స‌పోర్ట్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో...?
త‌మ్ముడు స‌క్సెస్ అయితే నేను డ్ర‌స్ మారుస్తా...?
ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న మంజు
వ‌ర్మ `బ్యూటిఫుల్‌` ఘాటు మాములుగాలేదుగా...?
ఉత్తేజ్ స్కూల్‌కి డిమాండ్ బాగానే ఉందే...?
సాయి పల్లవి 'అనుకోని అతిథి'
హీరో వెంక‌టేష్ నాకు ఇన్స్‌పిరేష‌న్‌
డైరెక్ట‌ర్లను అంత మాట అనేశాడేంటి
వి.వి. వినాయ‌క్ కి చోటాకె.నాయుడంటే భ‌య‌మా...?
రాజ‌మౌళి ఈగ తో పోటీ ప‌డుతున్న చీమ
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.